జ్యోతి నగర్ జీఎంఆర్ కాలనీలో ఎంగిలిపూల బతుకమ్మ సంబరాలు
- రాజ్యాంగ పరిరక్షణ సమరభేరి.. హైదరాబాద్కు జనగామ కాంగ్రెస్ సేవాదళ్ శ్రేణుల తరలింపు - November 27, 2026
- ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం నమోదు ప్రక్రియ వేగవంతం చేయాలి - November 27, 2026
- భారత రాజ్యాంగాన్ని కాపాడుకుందాం.. ఎన్నికల ప్రధాన కమిషనర్ రాజీనామా చేయాలి - November 27, 2026

జనగామ పట్టణంలోని జ్యోతి నగర్ జీఎంఆర్ కాలనీలో ఎంగిలిపూల బతుకమ్మ వేడుకలు ఘనంగా జరిగాయి. మహిళలు, యువతులు రంగురంగుల పూలతో బతుకమ్మలను అందంగా అలంకరించి, సంప్రదాయ దుస్తుల్లో బతుకమ్మల చుట్టూ చేరి పాటలు పాడుతూ ఉత్సాహంగా ఆటపాటలతో సందడి చేశారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగను ఐకమత్యంతో జరుపుకున్నారు. భక్తిశ్రద్ధలతో బతుకమ్మకు పూజలు నిర్వహించారు. మహిళల కోలాహలం, బతుకమ్మ పాటలతో జీఎంఆర్ కాలనీలో పండుగ వాతావరణం నెలకొంది. సంప్రదాయాలను కాపాడుకుంటూ మహిళలు ఆనందోత్సాహాల మధ్య వేడుకల్లో పాల్గొన్నారు.
