స్మార్ట్ రేషన్ కార్డులను సద్వినియోగం చేసుకోవాలి : కట్టంగూర్ సర్పంచ్ ముక్కామల శ్యామల శేఖర్
జ్ఞాన తెలంగాణ, కట్టంగూర్, అక్టోబర్ 8 : ప్రభుత్వం పేద ప్రజల సంక్షేమం కోసం అందిస్తున్న స్మార్ట్ రేషన్ కార్డులను లబ్ధిదారులు సద్వినియోగం చేసుకోవాలని కట్టంగూరు సర్పంచ్ ముక్కామల శ్యామల శేఖర్ అన్నారు. ప్రభుత్వం మంజూరు చేసిన స్మార్ట్ రేషన్ కార్డులను గురువారం ఆర్ఐ రామారావు తో కలిసి లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ అర్హులైన పేద కుటుంబాలకు రేషన్ కార్డులు అందించడం ద్వారా ప్రభుత్వం అందించే నిత్యావసర సరుకులు, ఇతర సంక్షేమ పథకాల ప్రయోజనాలు పొందే అవకాశం కలుగుతుందన్నారు. ప్రభుత్వం అందిస్తున్న సదుపాయాలను అర్హులైన ప్రతి కుటుంబం వినియోగించుకోవాలని సూచించారు. గ్రామంలో అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వయంతో పని చేయాలని సూచించారు. కార్యక్రమంలో ఉపసర్పంచ్ గుండు శేఖర్, జిపిఓ అల్లావుద్దీన్, వార్డు సభ్యులు ఏనుగు సైదులు, అయితగోని సైదమ్మ, అయితగోని సైదులు, ఏకుల సుజాత, శ్రీరామ సంధ్య, చిక్కుల శివాని, లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు

