జుట్టు తిరుపతి ముదిరాజ్ కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే కసిరెడ్డి

1001221386.jpg

కల్వకుర్తి :తలకొండపల్లి మండల కాంగ్రెస్ అధ్యక్షుడు కాసు శ్రీనివాస్‌రెడ్డి ఆధ్వర్యంలో జుట్టు తిరుపతి ముదిరాజ్ నివాసానికి కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి మంగళవారం విచ్చేశారు. ఈ సందర్భంగా తిరుపతి ముదిరాజ్ కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఇటీవల అనారోగ్యంతో స్టంట్ వేయించుకున్న ఆయన భార్య పద్మమ్మ ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకుని, ధైర్యం చెప్పారు.అనంతరం కుటుంబ సమస్యలు, స్థానిక సమస్యలపై ఆరా తీశారు. మండలంలో కాంగ్రెస్ పార్టీ బలోపేతం, కార్యకర్తల సంక్షేమంపై నాయకులతో చర్చించారు. కార్యకర్తలకు, వారి కుటుంబాలకు కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని ఎమ్మెల్యే భరోసా ఇచ్చారు. పార్టీ కోసం కష్టపడిన ప్రతి కార్యకర్తను గుర్తుంచుకుంటామని తెలిపారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు.

You may also like...