పద్మమ్మ మృతికి సంఘసేవకులు పాపి శెట్టి రామన్న నివాళి

పద్మమ్మ మృతికి సంఘ సేవకుడు రామన్న నివాళి

ఆమనగల్: ఆమనగల్ మున్సిపాలిటీ పరిధిలోని 6వ వార్డు సాయినగర్ కాలనీకి చెందిన ఉల్లిగడ్డ రవికృష్ణ తల్లి, కీర్తిశేషులు మామిడి చెట్టి పద్మమ్మ మృతి చెందారు. విషయం తెలుసుకున్న ప్రముఖ సంఘ సేవకుడు పాపిశెట్టి రామన్న ఆమె నివాసానికి చేరుకుని పార్థివ దేహానికి పూలమాల వేసి నివాళులర్పించారు.అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించి తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. అంత్యక్రియల్లో పాల్గొన్న రామన్న, బంధువులతో కలిసి పార్థివ దేహాన్ని భుజాలపై మోస్తూ అంతిమయాత్రలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పి, తాను అండగా ఉంటానని భరోసా కల్పించారు.ఈ కార్యక్రమంలో రామన్న మిత్రమండలి సభ్యులు ఉత్తనగంటి భాస్కర్, వెంకటేష్, ఆంజనేయులు, శ్రీను తదితరులతో పాటు బంధుమిత్రులు, శ్రేయోభిలాషులు పాల్గొన్నారు.1001241426.jpg

You may also like...