వైద్యురాలు కావాలనే కోరికకు – పేదరికం అడ్డంకి.. ఆదుకునే చేతుల కోసం ఎదురుచూపు
- ఎస్ఐఆర్ ప్రక్రియను వేగవంతం చేయాలి అదన కలెక్టర్ – బి చెన్నయ్య - September 24, 2026
- మృతురాలి కుటుంబానికి సర్పంచ్ కొండల్ యాదవ్ ఆర్థిక సాయం - September 24, 2026
- గణనాథుల సన్నిధిలో సర్పంచ్ మట్ట యాదమ్మ వెంకటయ్య గౌడ్ ప్రత్యేక పూజలు - September 24, 2026

వెల్దండ: తండ్రి చిన్నతనంలోనే దూరమైనా.. తల్లి కూలి పనులు చేస్తూ చదివించినా.. పేదరికాన్ని అధిగమించి వైద్య విద్యలో సీటు సాధించిన సురితకు ఇప్పుడు దాతల చేయూత అవసరమైంది.చదువులో ప్రతిభ కనబరిచిన సురిత పదో తరగతిలో 10/10 గ్రేడ్, ఇంటర్లో 90 శాతం మార్కులు సాధించింది. నీట్లో 432 మార్కులు సాధించి ఎస్సీ కోటాలో 608వ ర్యాంకు పొందింది.కౌన్సెలింగ్లో మహబూబాబాద్ ప్రభుత్వ వైద్య కళాశాలలో ఎంబీబీఎస్ సీటు దక్కించుకుంది.తండ్రి 2018లో మృతి చెందడంతో తల్లి కూలి పనులు చేస్తూ ఇద్దరు కుమార్తెలను చదివించింది. ఎన్నో ఆర్థిక ఇబ్బందులు ఎదురైనా కూతురి చదువుకు మాత్రం అడ్డుకాలేదు. తల్లి కష్టానికి ప్రతిఫలంగా సురిత వైద్య సీటు సాధించింది.అయితే కళాశాల ఫీజు, వసతి, ఇతర విద్యా ఖర్చులకు రూ.1.20 లక్షల వరకు అవసరం ఉంది. ఆర్థిక పరిస్థితి అంతంతమాత్రంగా ఉండటంతో సురిత వైద్య విద్యను కొనసాగించడం కుటుంబానికి భారంగా మారింది.వైద్యురాలిగా సేవ చేయాలన్న సురిత కలను సాకారం చేసేందుకు దాతలు ముందుకొచ్చి ఆపన్నహస్తం అందించాలని కుటుంబ సభ్యులు వేడుకుంటున్నారు.
