అమ్మపల్లి – మారేపల్లి బీటీ రోడ్డుకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే డాక్టర్ కూచుకుళ్ల రాజేష్ రెడ్డి

తిమ్మాజిపేట మండలంలోని అమ్మపల్లి గ్రామం నుండి మారేపల్లి కమాన్ వరకు 3.5 కిలోమీటర్ల మేర రూ. 3 కోట్ల 80 లక్షల నిధులతో నిర్మించనున్న బీటీ రోడ్డు పనులకు నాగర్ కర్నూల్ ఎమ్మెల్యే డాక్టర్ కూచుకుళ్ల రాజేష్ రెడ్డి గారు శంకుస్థాపన చేశారు.

1001338319.jpg

సోమవారం రాత్రి జేసీబీతో పనులను లాంఛనంగా ప్రారంభించారు. ఈ రోడ్డు నిర్మాణం పూర్తైతే అమ్మపల్లి, మారేపల్లి గ్రామాల ప్రజలకు రాకపోకలకు ఎంతో సౌకర్యంగా ఉంటుందని ఎమ్మెల్యే తెలిపారు.ఈ కార్యక్రమంలో సర్పంచ్ తిరుపతి రెడ్డి, జిల్లా యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు వినోద్, మండల అధ్యక్షులు వివేక్ రెడ్డి, మల్లయ్య గౌడ్, వెంకట్ రాం రెడ్డి తదితర నాయకులు, గ్రామ పెద్దలు, కార్యకర్తలు పాల్గొన్నారు.

You may also like...