వెల్దండ పోలీస్ స్టేషన్ పరిధిలో రెండు కేసులు నమోదు

వెల్దండ: వెల్దండ పోలీస్‌స్టేషన్‌లో వివిధ ఘటనలకు సంబంధించి మూడు కేసులు నమోదైనట్లు ఎస్సై యుగేందర్ రెడ్డి తెలిపారు.

ఇంట్లో చోరీ: గాజులోని భావితండాకు చెందిన వద్యావత్ దేవేందర్ తన పొలం వద్ద పనిచేసేందుకు 15 రోజుల క్రితం ఉత్తరప్రదేశ్‌కు చెందిన హేమంత్‌ను పనిలో పెట్టుకున్నాడు.దేవేందర్ దంపతులు కల్వకుర్తిలోని బంధువుల ఇంటికి వెళ్లి తిరిగి వచ్చేసరికి ఇంట్లోని బీరువా తెరిచి ఉండటాన్ని గుర్తించారు. అందులోని రూ.50 వేల నగదు, సుమారు ఐదు గ్రాముల బంగారు కమ్మలు కనిపించలేదు. హేమంత్ కూడా కనిపించకపోవడంతో అతడిపై అనుమానంతో ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేశారు

మహిళ అదృశ్యం: చెదురువల్లికి చెందిన పోలే విష్ణు ఫిర్యాదు మేరకు ఉమెన్ మిస్సింగ్ కేసు నమోదైంది. ఫిర్యాదుదారు సోదరి కవిత (34) కొంతకాలంగా మతిస్థిమితం సరిగా లేక గ్రామంలో తిరిగి తిరిగి ఇంటికి వచ్చేది. అయితే గురువారం ఉదయం 5 గంటలకు ఇంటి నుంచి వెళ్లిన ఆమె తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యులు పోలీసులను ఆశ్రయించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.1001230385.jpg

You may also like...