కష్టకాలంలో మృతుడి కుటుంబానికి అండగా సర్పంచ్.. రూ.3 వేల ఆర్థిక సాయం అందజేత

1001344605.jpg

వెల్దండ,నవంబర్ 09: ఉమ్మడి పోతేపల్లి గ్రామపంచాయతీ పరిధిలోని ఎంజీ కాలనీ, బావి తండాకు చెందిన బద్రు నాయక్ మృతి చెందడంతో పోతేపల్లి గ్రామ సర్పంచ్ తగుళ్ల కొండల్ యాదవ్ మృతుడి కుటుంబాన్ని పరామర్శించారు. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేసి, ఈ కష్ట సమయంలో వారికి అండగా నిలిచారు.తన వంతు సహాయంగా రూ.3,000 ఆర్థిక సాయం అందజేసి కుటుంబ సభ్యులకు మనోధైర్యం కల్పించారు.ఈ కార్యక్రమంలో వార్డు సభ్యుడు, యువ నాయకులు ఎగిరిశెట్టి శివ, మార్కండేయడు, బుషారాజ మధు, లట్టు యాదవ్ తదితరులు పాల్గొని మృతుడి కుటుంబానికి సానుభూతి తెలిపారు.

You may also like...