గూడు లేని నిరుపేదలకు ఇల్లు కాంగ్రెస్ ప్రభుత్వం తోనే సాధ్యం

1001210415.jpg

వెల్దండ: ప్రజా ప్రభుత్వంలోనే నిరుపేదలకు ఇందిరమ్మ ఇళ్లు కట్టిస్తున్నామని వెల్దండ గ్రామ సర్పంచ్ మట్ట యాదమ్మ వెంకటయ్య గౌడ్,

డీసీసీ ఉపాధ్యక్షులు యెన్నం భూపతి రెడ్డి అన్నారు.

రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఇందిరమ్మ ఇళ్ల పంపిణీ లో భాగంగా మండల కేంద్రంలోని కదమంచి సత్యమ్మ కు మంజూరైన ఇందిరమ్మ ఇంటి నిర్మాణానికి శుక్రవారం భూమి పూజ చేసి ప్రారంభించారు. అనంతరం వారు మాట్లాడుతూ అర్హులైన నిరుపేదలకు ఇందిరమ్మ ఇళ్లు ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి ప్రత్యేక చొరవతో మంజూరు చేయిస్తున్నామని అన్నారు. కార్యక్రమంలో ఉప సర్పంచ్ ఎర్ర శ్రీనివాస్, కార్యదర్శి గిరి గౌడ్, వార్డు సభ్యులు పిల్లి దేవేందర్, పసునోజు వాణి పురుషోత్తం,మారేపల్లి మంజుల శ్రీను,నాయకులు క్యాసరపు వెంకటయ్య, బయ్య మల్లయ్య, ఎండి రషీద్, కొయ్యల పుల్లయ్య, తిరుపతి రెడ్డి ,ఎండి హమీద్ , పుట్ట యాదయ్య,తుంగ శ్రీను ,మట్ట మల్లేష్ , సాంబ, శ్రీనివాస్ తదితరులు ఉన్నారు.

You may also like...