గంజాయి అక్రమ రవాణాపై ఉక్కుపాదం – 35 కిలోల గంజాయి స్వాధీనం.. ఇద్దరి అరెస్టు
- ఘనంగా కరీం భాయ్ బామ్మర్దుల రిసెప్షన్ వేడుక - October 8, 2026
- పారిశుద్ధ్య కార్మికులకు సత్య సాయి చీరల పంపిణీ - October 8, 2026
- ముత్యాలమ్మ ఆలయ నిర్మాణానికి రూ.1.05 లక్షల విరాళం - October 8, 2026

ఆమనగల్ అక్టోబర్ 07:గంజాయి అక్రమ రవాణా, సేవనంపై కఠిన చర్యలు తప్పవని మహేశ్వరం జోన్ డీసీపీ నారాయణరెడ్డి హెచ్చరించారు. ఆమనగల్లు మార్కెట్ యార్డు సమీపంలో పోలీసులు, ఎస్‌ఓటీ బృందం నిర్వహించిన తనిఖీల్లో 17 ప్యాకెట్లలో ఉన్న సుమారు 35 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకుని ఇద్దరిని అరెస్టు చేశారు.నిందితులను అల్లూరి సీతారామరాజు జిల్లా ప్రాంతానికి చెందిన కుంజం చందుబాబుదొర (26), కోసు వెంకటసాయిబాబు దొర (23)గా గుర్తించారు.వారి వద్ద గంజాయితో పాటు వివో మొబైల్ ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు. మొత్తం స్వాధీనం చేసుకున్న వస్తువుల విలువ సుమారు రూ.17.60 లక్షలు ఉంటుందని డీసీపీ తెలిపారు.రంపచోడవరం ప్రాంతానికి చెందిన ‘అభి’ గంజాయి రవాణాకు నిందితులతో ఒప్పందం చేసుకున్నట్లు విచారణలో తేలిందన్నారు. అతడు పరారీలో ఉండగా, పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలు గాలిస్తున్నాయని తెలిపారు.
