ఆపదలో ఆపన్న హస్తం జాతీయ కుటుంబ ప్రయోజన పథకం – రూ. 20 వేల చెక్కు అందజేసిన సర్పంచ్ కొండల్ యాదవ్
- వెల్దండకు వెలుగులు – 100 కెవి ట్రాన్స్ఫార్మర్ ప్రారంభించిన సర్పంచ్ - September 19, 2026
- కల్వకుర్తిలో విషాద ఘటన వినాయక మండపం వద్ద విద్యుత్ షాక్ తో యువకుడు బలి - September 19, 2026
- బాలల బంగారు భవిష్యత్తుకు పోషకాహారమే పునాది – వెల్దండలో సమన్వయ సమావేశం - September 19, 2026
వెల్దండ: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను అర్హులైన ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని రాష్ట్ర సర్పంచుల సంఘం ప్రధాన కార్యదర్శి, పోతేపల్లి గ్రామ సర్పంచ్ తగుళ్ల కొండలు యాదవ్ సూచించారు.ఇటీవల నూనె కృష్ణయ్య మృతి చెందడంతో ఆయన కుటుంబానికి ప్రభుత్వం నేషనల్ ఫ్యామిలీ బెనిఫిట్ స్కీమ్ (NFBS) కింద మంజూరు చేసిన రూ.20 వేల ఆర్థిక సాయం చెక్కును మంగళవారం బాధిత కుటుంబ సభ్యులకు సర్పంచ్ కొండలు యాదవ్ అందజేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆపద సమయంలో ప్రభుత్వం అందిస్తున్న ఆర్థిక సహాయం బాధిత కుటుంబాలకు కొంతమేర భరోసానిస్తుందని తెలిపారు. అర్హులైన ప్రతి కుటుంబం ప్రభుత్వ సంక్షేమ పథకాలపై అవగాహన పెంచుకుని వాటిని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. అవసరమైన వారికి ప్రభుత్వ పథకాల ద్వారా ఆర్థిక భరోసా అందేలా తనవంతు సహకారం అందిస్తామని తెలిపారు.ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు, యువ నాయకులు శారద బాలయ్యగౌడ్, గోరటి అశోక్ కుమార్, బాలు యాదవ్, ఎగిరిశెట్టి శివకుమార్ తదితరులు పాల్గొన్నారు.
