కల్వకుర్తి వేప చెట్టు గణేశుడిని దర్శించుకున్న మాజీ ఎమ్మెల్యే చల్లా వంశీచంద్ రెడ్డి

కల్వకుర్తి పట్టణంలో ప్రసిద్ధి చెందిన వేప చెట్టు గణేషుడు (నింబ వినాయకుడు) సన్నిధిలో భక్తి పరవశం నెలకొంది. వేప చెట్టు చెంత కొలువైన విఘ్నేశ్వరుడిని దర్శించుకుని భక్తులు ఆధ్యాత్మిక అనుభూతి పొందుతున్నారు.ఇందులో భాగంగా కల్వకుర్తి మాజీ శాసనసభ్యులు, ఎఐసిసి జాతీయ ఇన్‌చార్జ్ శ్రీ చల్లా వంశీచంద్ రెడ్డి గారు ఈరోజు వేప చెట్టు గణపతిని దర్శించుకున్నారు. సీడబ్ల్యూఎస్సీ ప్రత్యేక ఆహ్వానితులుగా ఉన్న చల్లా వంశీచంద్ రెడ్డి గారికి ఆలయ నిర్వాహకులు, స్థానిక నాయకులు ఘనంగా స్వాగతం పలికి శాలువాలతో సత్కరించారు. అనంతరం స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.1001336856.jpg

ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

You may also like...