డిసిసి డాక్టర్ సెల్ జిల్లా ప్రధాన కార్యదర్శిగా విజయ్ కుమార్
- బతుకమ్మ దసరా ఉత్సవాలకు పటిష్ట భద్రత కల్పించాలి.. మున్సిపాలిటీ చైర్మన్ పత్య నాయక్ - October 15, 2026
- డిండి ఎత్తిపోతల పథకం ఈనెల 17న మహాధర్నా - October 15, 2026
- ఆలయ నిర్మాణానికి లక్ష రూ.విరాళం..భక్తితో ముందుకొచ్చిన మండేగుత్తల కుటుంబ సభ్యులు - October 15, 2026
కల్వకుర్తి ఆగస్టు 31: వెల్దండ మండలం కుప్పగండ్ల గ్రామానికి చెందిన డా. ఎం. విజయ్‌కుమార్ ను జిల్లా కాంగ్రెస్ కమిటీ డీసీసీ డాక్టర్ సెల్ జిల్లా ప్రధాన కార్యదర్శిగా నియమించారు. నియామక ఉత్తర్వులను డా. హరికాంత్ రెడ్డి జనరల్ సెక్రటరీ, టీపీసీసీ డాక్టర్ సెల్,తెలంగాణ ఇన్చార్జ్ డా. దిలీప్ రెడ్డి, చైర్మన్, డాక్టర్ సెల్, నాగర్‌కర్నూల్ జిల్లా జారీ చేశారు.ఈ సందర్భంగా విజయ్‌కుమార్ మాట్లాడుతూ తనపై నమ్మకం ఉంచి ఈ బాధ్యతను అప్పగించినందుకు ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డికి,మరియు డిసిసి అధ్యక్షులు డా. వంశీకృష్ణలకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు.అలాగే తన నియామకానికి సహకరించిన టిపిసిసి డాక్టర్ సెల్ నాయకత్వానికి, జిల్లా కాంగ్రెస్ నాయకులకు మరియు పార్టీ శ్రేణులకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు.తనకు అప్పగించిన బాధ్యతను నిబద్ధత, నిజాయితీ, అంకితభావంతో నిర్వర్తిస్తూ, నాగర్‌కర్నూల్ జిల్లాలో డాక్టర్ సెల్‌ను మరింత బలోపేతం చేయడంతో పాటు వైద్యులు, వైద్య సిబ్బంది మరియు ప్రజల సంక్షేమం కోసం కృషి చేస్తానని తెలిపారు.
