గ్యాస్ వినియోగదారులకు నేటితో ఈ కేవైసీ గడువు
- గ్యాస్ వినియోగదారులకు నేటితో ఈ కేవైసీ గడువు - September 30, 2026
- మృతుడి కుటుంబానికి కాంగ్రెస్ నేత ఆర్థిక చేయూత - September 30, 2026
- లక్షలాది గొంతుకలు ఏకమై జై తెలంగాణ అని నినదించిన రోజు - September 30, 2026

నాగర్‌కర్నూల్: గ్యాస్ వినియోగదారులు ఎల్పీజీ కనెక్షన్లకు ఈ–కేవైసీ పూర్తి చేసుకోవాలని జిల్లా పౌరసరఫరాల అధికారి సూచించారు. అక్రమ గ్యాస్ కనెక్షన్లను అరికట్టడంతో పాటు ప్రభుత్వ రాయితీల దుర్వినియోగాన్ని నియంత్రించేందుకు ప్రభుత్వం ఈ–కేవైసీ ప్రక్రియను చేపట్టిందని తెలిపారు.కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందిస్తున్న రాయితీలను పొందాలంటే గ్యాస్ కనెక్షన్‌ను ఆధార్‌తో అనుసంధానం చేసి ఈ–కేవైసీ తప్పనిసరిగా పూర్తి చేసుకోవాలని సూచించారు. ఏడాదికి పైగా బయోమెట్రిక్ ఈ–కేవైసీ ప్రక్రియ కొనసాగుతున్నప్పటికీ ఇంకా 100 శాతం పూర్తికాలేదన్నారు. అక్టోబర్ 1 వరకు తుది గడువు ఉండటంతో వినియోగదారులు నేడే ఈ–కేవైసీ పూర్తి చేసుకోవాలని కోరారు.
