రిపోర్టర్, మేడ్చల్-మల్కాజ్గిరి | 9966689865
Latest posts by Veeranna Yerra
(see all) పడమటి సాయిగూడెంలో భూభారతి భూ రీ సర్వేపై అవగాహన సదస్సు
రైతుల భూ సమస్యల పరిష్కారానికి రీ సర్వే దోహదం: మాజీ చైర్‌పర్సన్ ముల్లి పావని
ఘట్‌కేసర్ MMC కార్పొరేషన్ 6వ డివిజన్ పరిధిలోని పడమటి సాయిగూడెంలో భూభారతి భూ రీ సర్వేపై అవగాహన సదస్సు నిర్వహించారు. JAC గౌరవ అధ్యక్షుడు విజయేందర్ రెడ్డి, RDO ఎన్. వెంకట్ రెడ్డి, MRO చంద్రశేఖర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాజీ మున్సిపల్ చైర్‌పర్సన్ ముల్లి పావని జంగయ్య యాదవ్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేపట్టిన భూభారతి రీ సర్వేతో రైతుల భూ హద్దుల సమస్యలు పరిష్కారమై, పొరుగు రైతుల మధ్య వివాదాలు తగ్గుతాయని తెలిపారు. సమస్యల పరిష్కారానికి RDO, MROలను సంప్రదించాలని సూచించారు. సర్వే అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో అధికారులు, ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ నాయకులు, రైతులు, గ్రామస్థులు పాల్గొన్నారు.
