తెలంగాణలో భారీగా ఐపీఎస్ అధికారుల బదిలీలు.
- డంప్‌యార్డ్ సమస్య శాశ్వత పరిష్కారం కై,మంత్రి శ్రీధర్ బాబుకు వినతి - November 12, 2026
- తెలంగాణలో భారీగా ఐపీఎస్ అధికారుల బదిలీలు. - November 12, 2026
- డ్రంక్ అండ్ డ్రైవ్ కేసుల్లో ఐదుగురికి జైలు శిక్ష - November 12, 2026
తెలంగాణ రాష్ట్రంలో పోలీస్ శాఖలో భారీ స్థాయిలో ఐపీఎస్ అధికారుల బదిలీలు, పోస్టింగ్‌లు చేపడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు సాధారణ పరిపాలన శాఖ (జీఏడీ) 2026 నవంబర్ 12న జీఓ ఆర్టీ నంబర్ 1654ను విడుదల చేసింది. మొత్తం 21 మంది ఐపీఎస్ అధికారులకు స్థానచలనం కల్పిస్తూ కీలక బాధ్యతలు అప్పగించింది.ప్రస్తుత హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ బదిలీ కాగా, ఆయన స్థానంలో మహేష్ మురళీధర్ భగవత్‌ను హైదరాబాద్ పోలీస్ కమిషనర్‌గా నియమించారు. వీసీ సజ్జనార్‌కు తెలంగాణ ఫైర్, డిజాస్టర్ రెస్పాన్స్, ఎమర్జెన్సీ అండ్ సివిల్ డిఫెన్స్ విభాగం డీజీగా బాధ్యతలు అప్పగించారు.

