పేదల వైద్యానికి సీఎం సహాయనిధి అండ – కొలన్ హన్మంత్ రెడ్డి


కుత్బుల్లాపూర్: నియోజకవర్గంలోని ఐదుగురు పేద వైద్య లబ్ధిదారులకు ముఖ్యమంత్రి సహాయనిధి (CMRF) ద్వారా మంజూరైన రూ.1,93,000 ఆర్థిక సహాయం చెక్కులను కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జి కొలన్ హన్మంత్ రెడ్డి బుధవారం బాచుపల్లి కాంగ్రెస్ కార్యాలయంలో అందజేశారు. రాష్ట్ర మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు సహకారంతో శస్త్రచికిత్సల నిమిత్తం ఈ నిధులు మంజూరయ్యాయని తెలిపారు. పేదల సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని, అర్హులైన వారు సీఎం సహాయనిధిని సద్వినియోగం చేసుకోవాలని హన్మంత్ రెడ్డి సూచించారు. కార్యక్రమంలో నిజాంపేట్ సర్కిల్ అధ్యక్షుడు కొలన్ రాజశేఖర్ రెడ్డి, రఫియా బేగం, సయ్యద్ రఫాత్, మధుసూదన్ రెడ్డి, నబీ, కావాలి గోపాల్ తదితరులు పాల్గొన్నారు.

You may also like...