రిపోర్టర్, మేడ్చల్-మల్కాజ్గిరి | 9966689865
Latest posts by Veeranna Yerra
(see all)
- మేడ్చల్, సేవించి వాహనాలు నడిపిన వారిపై మేడ్చల్ ట్రాఫిక్ పోలీసులు చేపట్టిన చర్యల్లో భాగంగా మరో ఐదుగురికి న్యాయస్థానం జైలు శిక్ష విధించింది. మేడ్చల్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన డ్రంక్ అండ్ డ్రైవ్, డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా వాహనాలు నడిపిన మొత్తం 8 కేసులను గురువారం మేడ్చల్ ప్రధాన జూనియర్ సివిల్ జడ్జి-కమ్-VII అదనపు జ్యుడీషియల్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ న్యాయస్థానంలో విచారించారు.
వీటిలో లైసెన్స్ లేకుండా వాహనాలు నడిపిన రెండు కేసులకు సంబంధించి రూ.2,000 జరిమానా విధించారు. మరో ఆరు డ్రంక్ అండ్ డ్రైవ్ కేసుల్లో రూ.4,500 జరిమానాతో పాటు ఐదుగురికి జైలు శిక్ష విధించారు. ఒకరికి 10 రోజులు, మరో నలుగురికి నాలుగు రోజుల చొప్పున జైలు శిక్ష ఖరారు చేశారు.
ఈ సందర్భంగా మేడ్చల్ ట్రాఫిక్ పోలీసులు వాహనదారులు మద్యం సేవించి డ్రైవింగ్ చేయవద్దని, తప్పనిసరిగా డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలని సూచించారు. ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘిస్తే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు.
