డబల్ బెడ్రూమ్ లలో తాగునీటి బోరు సౌకర్యం కల్పించాలి

కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని జగద్గిరిగుట్ట వాంబే కాలనీ, మహాదేవపురం డివిజన్ పరిధిలోని దేవేందర్ నగర్, కైసర్ నగర్ డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లలో తాగునీటి సమస్య పరిష్కారానికి నాలుగు బోర్‌వెల్స్ డ్రిల్లింగ్ చేయించాలని కోరుతూ ఎంపీ ఈటల రాజేందర్‌కు వినతిపత్రం అందజేశారు. మాజీ కార్పొరేటర్, బీజేపీ రాష్ట్ర మున్సిపల్ సెల్ కో-కన్వీనర్ రావుల శేషగిరి, బీజేపీ జిల్లా ఓబీసీ మోర్చా అధ్యక్షుడు జేకే శేఖర్ యాదవ్ ద్వారా ఈ వినతి సమర్పించారు. ప్రజల నీటి ఇబ్బందులను పరిష్కరించాలని కోరారు.

You may also like...