6 హోటళ్లకు షాక్.. లైసెన్సులు సస్పెండ్…
- SR ఫౌండేషన్ ఆధ్వర్యంలో IMAX లైట్ ఏర్పాటు… - October 8, 2026
- బతుకమ్మ దసరా సందర్భంగా స్ట్రీట్ లైట్లు ఏర్పాటుచేసిన పాలకవర్గం… - October 8, 2026
- బీబీపేట్ PACS నూతన పాలకవర్గం ప్రమాణ స్వీకారం. - October 8, 2026
కామారెడ్డి జిల్లా, భిక్‌నూర్ మండలం NH-44పై TGSAFE 10 బృందాలు హోటళ్లలో తనిఖీలు నిర్వహించాయి. వంటగదుల్లో బూజు, బొద్దింకలు, బల్లులు, ఎలుకలు, గడువు దాటిన ఫుడ్, సరిగా నిల్వ చేయని చికెన్, మటన్, ఫిష్‌లను గుర్తించారు. జైకా మల్టీ క్యుజిన్(బస్వాపూర్), మాల్గుడి, వసుధ(భిక్‌నూర్), న్యూ ఉడిపి కృష్ణ భవన్, లుఫియన్స్ ఫ్యామిలీ(అడ్లూర్), తాజ్ ఫ్యామిలీ ధాబా(సదాశివనగర్) హోటళ్ల లైసెన్సులు సస్పెండ్ చేశారు. ఈ హోటళ్లన్నింటి కార్యకలాపాలను తక్షణమే నిలిపివేయాలని అధికారులు ఆదేశించారు.

