సంజయ్‌నగర్ మోడల్ మార్కెట్‌కు వీధి వ్యాపారుల నుంచి విశేష స్పందన
- సెయింట్ మేరీస్ హైస్కూల్లో ఘనంగా బతుకమ్మ సంబరాలు - October 9, 2026
- సంజయ్‌నగర్ మోడల్ మార్కెట్‌కు వీధి వ్యాపారుల నుంచి విశేష స్పందన - October 9, 2026
- హైదరాబాద్ రవీంద్రభారతిలో 6TV రిపోర్టర్ కు ఘన సత్కారం - October 9, 2026
జనగామ పట్టణాన్ని పరిశుభ్రంగా, సుందరంగా, ట్రాఫిక్ ఇబ్బందులు లేని నగరంగా తీర్చిదిద్దే లక్ష్యంతో మున్సిపాలిటీ చేపట్టిన సంజయ్‌నగర్ మోడల్ మార్కెట్‌కు వీధి వ్యాపారుల నుంచి విశేష స్పందన లభిస్తోంది. ఈ నెల 7న ప్రారంభమైన దరఖాస్తుల స్వీకరణకు ఇప్పటివరకు 175 దరఖాస్తులు అందినట్లు మున్సిపల్ కమిషనర్ తెలిపారు. వీటిలో 80 కూరగాయల దుకాణాలు, 21 పండ్ల దుకాణాలు, 66 నాన్‌వెజ్ దుకాణాలు, 8 ఇతర వ్యాపారాలకు సంబంధించినవి ఉన్నాయి. అక్టోబర్ 10 చివరి తేదీ కావడంతో, సెలవు రోజైనా మున్సిపల్ కార్యాలయంలో ప్రత్యేక కౌంటర్ ఏర్పాటు చేస్తున్నట్లు కమిషనర్ వెల్లడించారు. దరఖాస్తు చేసుకోని వ్యాపారులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని సూచించారు.
