జాతీయ లోక్ అదాలత్లో అధిక సంఖ్యలో కేసుల పరిష్కారానికి కృషి చేయాలి
- జనగామకు కాకతీయ ఇంజనీరింగ్ కళాశాల మంజూరుకు కృషి చేస్తా: కేయూ రిజిస్ట్రార్ రామచంద్రం - November 23, 2026
- రాచకొండ రాములు చిత్రపటానికి రియల్ ఎస్టేట్ యూనియన్ నాయకుల నివాళులు - November 23, 2026
- పాలకుర్తిలో అంగరంగ వైభవంగా కార్తీక పౌర్ణమి వేడుకలు.. భక్తులకు ఆలయ ఈవో పిలుపు - November 23, 2026
ఈ ఏడాది డిసెంబర్ 12న రెండవ శనివారం నిర్వహించనున్న జాతీయ లోక్ అదాలత్లో అధిక సంఖ్యలో రాజీ పడదగిన కేసులను పరిష్కరించేందుకు న్యాయవాదులు సహకరించాలని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్, జిల్లా ప్రధాన న్యాయమూర్తి బి. ప్రతిమ సూచించారు.ఈ సందర్భంగా సోమవారం జనగామ జిల్లా కోర్టు బార్ అసోసియేషన్ హాలులో న్యాయవాదులతో నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ క్రిమినల్, సివిల్, కుటుంబ వివాదాలు, నగదు రికవరీ, మోటార్ వాహన ప్రమాదాలు, చిట్ఫండ్, విద్యుత్, చెక్ బౌన్స్ తదితర రాజీ పడదగిన కేసులను లోక్ అదాలత్ ద్వారా పరిష్కరించుకోవాలని తెలిపారు.కేసుల పరిష్కారంలో మధ్యవర్తులుగా వ్యవహరించే సీనియర్ న్యాయవాదుల పాత్ర ఎంతో కీలకమని, మీడియేషన్ ద్వారా ఇరుపక్షాల మధ్య వివాదాలను త్వరితగతిన పరిష్కరించుకోవచ్చని పేర్కొన్నారు.ఈ సందర్భంగా సుప్రీంకోర్టు గుర్తింపు పొందిన అక్రిడిటేషన్ సర్టిఫికెట్ను సీనియర్ న్యాయవాది ఏనగందుల ఏ. భిక్షపతికి జిల్లా ప్రధాన న్యాయమూర్తి బి. ప్రతిమ అందజేశారు. ఇతర మీడియేటర్లు కూడా ఇటువంటి గుర్తింపు పొందాలని ఆమె ఆకాంక్షించారు.సీనియర్ సివిల్ జడ్జి శంకర శ్రీదేవి మాట్లాడుతూ కేసుల పరిష్కారంలో మీడియేటర్ల ప్రాధాన్యత, వారి బాధ్యతలను వివరించారు. బార్ అసోసియేషన్ అధ్యక్షుడు బండ దయాకర్ రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో జాతీయ లోక్ అదాలత్ విజయవంతానికి న్యాయవాదుల తరఫున పూర్తి సహకారం అందిస్తామని ఆయన తెలిపారు.ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన న్యాయమూర్తి బి. ప్రతిమ, సీనియర్ సివిల్ జడ్జి శంకర శ్రీదేవి, అదనపు జూనియర్ సివిల్ జడ్జి సందీప్, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు బండ దయాకర్ రెడ్డి, సీనియర్ న్యాయవాదులు, మీడియేటర్లు, ప్యానల్ లాయర్లు తదితరులు పాల్గొన్నారు.
