సీతక్కకు ఆర్ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌ ఘాటు ప్రశ్న

“సీఎం ఫటాఫట్‌ రేవంత్‌రెడ్డి మీద మీకున్న నమ్మకం నిజంగా సూపర్‌ సీతక్క. కానీ.. నిన్న ఒక ఆదివాసీ బిడ్డ గురుకుల పాఠశాలలో చదువుకొని, నర్స్‌ ట్రైనింగ్‌ పూర్తి చేసుకొని హైదరాబాద్‌లోని ప్రైమ్‌కేర్‌ హాస్పిటల్‌లో అత్యంత క్రూరంగా చంపబడితే.. కనీసం హోంమంత్రిగా నేరస్థలాన్ని సందర్శించి బాధిత కుటుంబాన్ని పరామర్శించకపోతే ఎట్ల?” అని బీఆర్‌ఎస్‌ నేత ఆర్ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌ ట్విట్టర్‌ వేదికగా ప్రశ్నించారు.

“ఫటాఫట్‌గా పైసలు సంపాయించడం, ఢిల్లీకి మూటలు చేరవేయడంలో దిట్టలు.. కానీ ప్రజల ప్రాణాలు రక్షించడం మీకు చేతకాదు” అంటూ ప్రభుత్వ తీరుపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. ప్రజల భద్రత విషయంలో ప్రభుత్వం బాధ్యతగా వ్యవహరించాలని, బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని ఆర్ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌ డిమాండ్‌ చేశారు.

You may also like...