అంతర్జాతీయ కరాటే పోటీల్లో సత్తా చాటిన ది మాస్టర్ మైండ్ స్కూల్ విద్యార్థులు
- ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలపై బీజేపీ నిరసన దీక్ష - August 31, 2026
- రైల్వే డబుల్ లైన్ భూసేకరణ పనులు వేగవంతం చేయాలి - August 31, 2026
- ఓబీసీ సెల్ నూతన కమిటీలకు దరఖాస్తుల ఆహ్వానం - August 31, 2026

అంతర్జాతీయ ఓపెన్ ఆల్-స్టైల్ మార్షల్ ఆర్ట్స్ ఛాంపియన్‌షిప్ (కుంగ్ ఫూ, కరాటే, టేక్వాండో) పోటీల్లో ది మాస్టర్ మైండ్ స్కూల్, గోపనపల్లి బ్రాంచ్ విద్యార్థులు సత్తా చాటారు.అండర్-14 విభాగంలో రుషిత, సాయి వర్ష, నైనికా, భవిత, రోహిణి, వశిష్ఠ, వినయ్ గోల్డ్ మెడల్స్ సాధించారు.ఈ సందర్భంగా కరాటే మాస్టర్ గట్టుఇప్పలపల్లి గ్రామ వాస్తవ్యులు మహేష్ మాట్లాడుతూ,విద్యార్థులు ఎంతో కష్టపడి సాధన చేసి అంతర్జాతీయ స్థాయిలో గోల్డ్ మెడల్స్ సాధించడం గర్వంగా ఉందన్నారు. పాఠశాల యాజమాన్యం, ప్రిన్సిపాల్ సహకారం వల్లనే ఇది సాధ్యమైందని, భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధిస్తామని మాస్టర్ తెలిపారు.విజేతలను పాఠశాల యాజమాన్యం రాజు, ప్రిన్సిపాల్ కృష్ణవేణి, పీఈటీ ప్రశాంత్ అభినందించారు.
