జహీరాబాద్లో ఇందిరా గాంధీ జయంతి వేడుకలు
- నిషేధిత భూమి రిజిస్ట్రేషన్.. సబ్ రిజిస్ట్రార్ అరెస్టు - September 6, 2026
- క్రిష్ణగిరి పాదాల గుట్టకు తిరిగి పూర్వ వైభవం - September 5, 2026
- శంకర్పల్లి మున్సిపాలిటీలో జోరు అందుకున్న అండర్ డ్రైనేజీ పనులు - September 5, 2026

జహీరాబాద్ పట్టణంలో మాజి ప్రధానమంత్రి స్వర్గీయ ఇందిరా గాంధీ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు కాందెం నరసింలు మరియు కాంగ్రెస్ మైనారిటీ నాయకుడు మొహమ్మద్ ఇనాయత్ అలీ ఆధ్వర్యంలో నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
ఇందిరా గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన నేతలు, ఆమె దేశ నిర్మాణానికి చేసిన సేవలను స్మరించారు. ప్రజాసేవలో ఇందిరా గాంధీ చూపిన ధైర్యం, సంకల్పం అందరికీ ఆదర్శం అని నాయకులు పేర్కొన్నారు.
పట్టణంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ శ్రేణులు ఉత్సాహంగా పాల్గొని జయంతి వేడుకలను విజయవంతం చేశారు.
