ముత్యాలమ్మ ఆలయ నిర్మాణానికి రూ.1.05 లక్షల విరాళం

1001246474.jpg

వెల్దండ:మండల పరిధిలోని గానుగట్టు తండా గ్రామపంచాయతీ పరిధిలోని పుష్కబోడు తండాలో గిరిజనుల ఆరాధ్యదైవం ముత్యాలమ్మ దేవాలయ నిర్మాణానికి మాజీ సర్పంచ్ పత్యానాయక్ రూ.1.05 లక్షల విరాళం అందించారు. ఆలయ నిర్మాణానికి తన వంతు సహకారం అందించడం సంతోషంగా ఉందని తెలిపారు. మరింత మంది దాతలు ముందుకు వచ్చి ఆలయ నిర్మాణానికి సహకరించాలని కోరారు. విరాళం అందించిన పత్యానాయక్‌కు తండా ప్రజలు, ఆలయ నిర్వాహకులు కృతజ్ఞతలు తెలిపారు.

You may also like...