కల్వకుర్తి నియోజకవర్గంలో విద్యుత్ కోతలపై బీఆర్ఎస్ మెరుపు ధర్నా

కల్వకుర్తి నియోజకవర్గం కడ్తాల్ మండలం రావిచెడు విద్యుత్ సబ్ స్టేషన్ ను బీఆర్ఎస్ నాయకులు ముట్టడించారు.కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక 3 ఏళ్లుగా రైతులకు విద్యుత్ కోతలు పెరిగి పంటలు ఎండిపోతున్నా రేవంత్ రెడ్డి సర్కార్ పట్టించుకోవడం లేదని నిరసిస్తూ మాజీ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ తో కలిసి రాష్ట్ర మిషన్ భగీరథ మాజీ వైస్ చైర్మన్ ఉప్పల వెంకటేష్ రోడ్డుపై బైఠాయించి రైతులతో కలిసి ధర్నా చేశారు.ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీ దశరత్ నాయక్, ఎల్.ఎన్. రెడ్డి,…

బాలాపూర్ గణనాథుడి సన్నిధిలో బీఆర్ఎస్ నేతల ప్రత్యేక పూజలు

దేశ ప్రసిద్ధి గాంచిన బాలాపూర్ గణేష్ ఉత్సవాల్లో కల్వకుర్తి మాజీ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్, బీఆర్ఎస్ రాష్ట్ర మీడియా ప్యానలిస్టు, సర్పంచుల సంఘం మాజీ రాష్ట్ర అధ్యక్షుడు గూడూరు లక్ష్మీ నర్సింహ్మ రెడ్డి పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.గణనాథుడికి అర్చనలు చేసి ప్రజలందరూ సుఖ సంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని ప్రార్థించారు. ఉత్సవాలు ప్రశాంతంగా కొనసాగాలని ఆకాంక్షించారు.అనంతరం ఉత్సవ కమిటీ అధ్యక్షుడు నిరంజన్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వాహకులు వారిని శాలువాతో సత్కరించి, బాలాపూర్ ప్రసిద్ధ లడ్డూ ప్రసాదాన్ని అందజేశారు….

తలకొండపల్లి లో గ్యాస్ సిలిండర్ల కొరత .!

వినియోగదారుల తీవ్ర ఇబ్బందులు – సరఫరా పునరుద్ధరించాలని విజ్ఞప్తితలకొండపల్లి: మండలంలో హెచ్‌పీ గ్యాస్ సిలిండర్ల కొరతతో వినియోగదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సాధారణంగా సుమారు 25 రోజులకు ఒకసారి సిలిండర్ అందాల్సి ఉండగా, బుకింగ్ చేసిన అనంతరం డీలర్‌ను సంప్రదిస్తే ప్రస్తుతం నిల్వలు లేవని సమాధానం వస్తోందని వినియోగదారులు చెబుతున్నారు.దీంతో వంట గ్యాస్ కోసం ప్రజలు రోజుల తరబడి ఎదురుచూడాల్సిన పరిస్థితి నెలకొంది. సంబంధిత అధికారులు స్పందించి గ్యాస్ సిలిండర్ల సరఫరాను పునరుద్ధరించి, వినియోగదారులకు సకాలంలో సిలిండర్లు…

ఆడబిడ్డ వైద్య కల సాకారానికి ఉప్పల వెంకటేష్ అన్న చేయూత

కల్వకుర్తి: కల్వకుర్తి నియోజకవర్గం, వెల్దండ మండలం, చౌదర్ పల్లి గ్రామానికి చెందిన పేద కుటుంబానికి చెందిన సిరి అనే విద్యార్థిని మెడిసిన్ చదువుకు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న విషయం తెలుసుకున్న రాష్ట్ర మిషన్ భగీరథ మాజీ వైస్ చైర్మన్, ఉప్పల చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ శ్రీ ఉప్పల వెంకటేష్ అన్న గారు మానవతా దృక్పథంతో స్పందించారు.ఆర్థిక సహాయం కోసం వారిని సంప్రదించగా, వెంటనే రూ.15,000/- ఆర్థిక సహాయాన్ని అందించి ఆ విద్యార్థిని ఉన్నత చదువుకు అండగా నిలిచారు….

ఘనంగా పాండు నాయక్ జన్మదిన వేడుకలు

కల్వకుర్తి: కాంగ్రెస్ పార్టీ గిరిజన విభాగం జిల్లా సీనియర్ నాయకులు ఎం. పాండు నాయక్ (రతన్ సింగ్) జన్మదిన సందర్భంగా ఆయన నివాసంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు పాల్గొని శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్భంగా జిల్లా కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి,దిశ జిల్లా కమిటీ సభ్యులు ఎం. మోతీలాల్ నాయక్ పాండు నాయక్‌ను శాలువాతో సత్కరించి జన్మదిన శుభాకాంక్షలు,అభినందనలు తెలిపారు.కార్యక్రమంలో కిసాన్ సెల్ తాలూకా అధ్యక్షులు పర్వత్ రెడ్డి, యువజన కాంగ్రెస్ మాజీ మండల అధ్యక్షులు…

బ్రహ్మంగారి కాలనీలోని గణనాథుని ప్రత్యేక పూజలు పాల్గొన్న సింగిరెడ్డి

కడ్తాల్: కడ్తాల్ పట్టణంలోని బ్రహ్మగారి కాలనీలో టీమ్ బీజీసీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గణనాథుడిని ఐక్యత ఫౌండేషన్ చైర్మన్, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు, టాస్క్ సిఓఓ సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి మాజీ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్‌తో కలిసి దర్శించుకున్నారు.ఈ సందర్భంగా గణనాథుడికి ప్రత్యేక పూజలు నిర్వహించి, ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షించారు. అనంతరం టీమ్ బీగీసీ ఆధ్వర్యంలో నిర్వహించిన అన్నప్రసాద వితరణ కార్యక్రమంలో పాల్గొని భక్తులు, కాలనీ వాసులతో కలిసి అన్నప్రసాదాన్ని స్వీకరించారు.అన్నప్రసాద వితరణ…

స్వర్ణ సంచలనం..లంకపై భారత్‌ ఘన విజయం!

జ్ఞానతెలంగాణ,స్పోర్ట్స్ ప్రతినిధి :ఆసియా క్రీడలు–2026 మహిళల క్రికెట్‌లో భారత జట్టు అద్భుత ప్రదర్శనతో స్వర్ణ పతకాన్ని సొంతం చేసుకుంది. నిషిన్‌లోని కోరోగీ స్పోర్ట్స్‌ పార్క్‌లో శ్రీలంకతో జరిగిన ఫైనల్‌ పోరులో టీమిండియా 147 పరుగుల భారీ తేడాతో ఘన విజయం సాధించింది. ప్రత్యర్థికి ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా...

మతిస్థిమితం లేని వృద్ధుడి ఆచూకీ కోసం విజ్ఞప్తి

దృశ్యంలో వృద్ధుడి ఫోటో ఊరుకొండ: నాగర్‌కర్నూల్ జిల్లా ఊరుకొండ మండలం జాకినాలపల్లి గ్రామంలో మతిస్థిమితం లేని ఓ వృద్ధుడు ఉన్నట్లు గ్రామస్తులు తెలిపారు. ప్రస్తుతం ఆయన జాకినాలపల్లి గ్రామంలో ఉన్నట్లు సమాచారం.పై ఫోటోలో కనిపిస్తున్న వృద్ధుడు ఎవరికైనా తెలిసినట్లయితే, ఆయన కుటుంబ సభ్యులు లేదా బంధువులకు సమాచారం అందించేందుకు జాకినాలపల్లి గ్రామాన్ని సంప్రదించాలని గ్రామస్తులు కోరారు.వృద్ధుడి ఆచూకీ తెలిసిన వారు వెంటనే గ్రామస్తులకు సమాచారం అందించి, ఆయనను కుటుంబ సభ్యుల వద్దకు చేర్చేందుకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.