బండమేది వెంకటేష్ ఆధ్వర్యంలో మనీషా అనంత్ రెడ్డి కి ఘన సత్కారం
- రుతుక్రమ ఆరోగ్యంపై సుప్రీం ఆగ్రహం! - October 18, 2026
- ఓటర్ల జాబితాలపై కాంగ్రెస్ విజయం! - October 18, 2026
- బండమేది వెంకటేష్ ఆధ్వర్యంలో మనీషా అనంత్ రెడ్డి కి ఘన సత్కారం
- October 18, 2026

హైకోర్టు జూనియర్ సివిల్ జడ్జిగా ఎంపికైన మనీషా అనంత్ రెడ్డిని చేవెళ్ల నియోజకవర్గ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు బండమేది వెంకటేష్ మహాలింగాపురంలోని ఆమె నివాసంలో శాలువాతో సత్కరించి, భగవద్గీతను అందజేశారు. మనీషా విజయం చేవెళ్ల ప్రాంతంలోని అన్ని వర్గాల మహిళలకు గర్వకారణమని వెంకటేష్ పేర్కొన్నారు. రాజ్యాంగ విలువలకు కట్టుబడి బడుగు, బలహీన వర్గాలకు న్యాయం అందించాలని ఆకాంక్షించారు. మనీషా మాట్లాడుతూ తనను సత్కరించిన వెంకటేష్కు కృతజ్ఞతలు తెలిపారు. నిష్పక్షపాతంగా న్యాయం అందిస్తానని చెప్పారు. కార్యక్రమంలో బౌరంపేట రామ్మోహన్ రెడ్డి, బీసీ సంఘం నాయకులు, స్థానిక ప్రముఖులు పాల్గొన్నారు.
