ఆడబిడ్డ వైద్య కల సాకారానికి ఉప్పల వెంకటేష్ అన్న చేయూత

కల్వకుర్తి: కల్వకుర్తి నియోజకవర్గం, వెల్దండ మండలం, చౌదర్ పల్లి గ్రామానికి చెందిన పేద కుటుంబానికి చెందిన సిరి అనే విద్యార్థిని మెడిసిన్ చదువుకు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న విషయం తెలుసుకున్న రాష్ట్ర మిషన్ భగీరథ మాజీ వైస్ చైర్మన్, ఉప్పల చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ శ్రీ ఉప్పల వెంకటేష్ అన్న గారు మానవతా దృక్పథంతో స్పందించారు.1001337869.jpg

ఆర్థిక సహాయం కోసం వారిని సంప్రదించగా, వెంటనే రూ.15,000/- ఆర్థిక సహాయాన్ని అందించి ఆ విద్యార్థిని ఉన్నత చదువుకు అండగా నిలిచారు. పేద విద్యార్థుల చదువులకు తన వంతు సహాయం అందిస్తూ ఉప్పల వెంకటేష్ అన్న ఎంతో మందికి ఆదర్శంగా నిలుస్తున్నారని గ్రామస్తులు కొనియాడారు.ఈ కార్యక్రమంలో చౌదర్ పల్లి గ్రామ ఉప సర్పంచ్ రాజీవ్, వార్డు మెంబర్ భారత్, ఉప్పల వెంకటేష్ అన్న ముఖ్య అనుచరుడు కేతావత్ సాయి కుమార్, గ్రామ యువ నాయకులు మల్లేష్, మోహన్ తదితరులు పాల్గొన్నారు.

You may also like...