సీఎంఆర్ఎఫ్ చెక్కుల ద్వారా బాధ్యత కుటుంబాలకు ఎమ్మెల్యే చేయూత

కల్వకుర్తి : సెప్టెంబర్ 22:కల్వకుర్తి నియోజకవర్గ అభివృద్ధి, ప్రజా సంక్షేమంపై ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డి ప్రత్యేక దృష్టి సారించారు. హైదరాబాద్‌లోని తన నివాసంలో వివిధ మండలాలకు చెందిన ముఖ్య నాయకుల సమక్షంలో లబ్ధిదారులకు సీఎం సహాయ నిధి చెక్కులు, ఎల్‌ఓసీ మంజూరు పత్రాలను ఎమ్మెల్యే అందజేశారు.ఈ సందర్భంగా లబ్ధిదారులకు మంజూరైన ఆర్థిక సహాయం సకాలంలో అందేలా నాయకులు, అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఎమ్మెల్యే సూచించారు.అనంతరం కల్వకుర్తి నియోజకవర్గ పరిధిలో హౌసింగ్‌ ప్రగతిపై హౌసింగ్‌ శాఖ అధికారులు,…

జిల్లా కాంగ్రెస్ అధ్యక్షురాలు పారిజాత నరసింహారెడ్డికి ఎమ్మెల్యే కసిరెడ్డి అభినందనలు

కల్వకుర్తి సెప్టెంబర్ 22:రంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలిగా ఇటీవల ఎన్నికైన శ్రీమతి చిగురింత పారిజాత నర్సింహారెడ్డి గారు హైదరాబాద్‌లోని కల్వకుర్తి ఎమ్మెల్యే శ్రీ కసిరెడ్డి నారాయణ రెడ్డి గారి నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డి గారు ఆమెను శాలువాతో సత్కరించి అభినందనలు తెలిపారు. జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలిగా బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఆమె నాయకత్వంలో పార్టీ మరింత బలోపేతం కావాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ…

అసంపూర్తి ఇళ్ల నిర్మాణాలకు ఉప్పల వెంకటేష్ సిమెంట్ అందజేత

కల్వకుర్తి: కల్వకుర్తి మండలంలోని గుండూరు గ్రామంలో అసంపూర్తిగా ఉన్న ఇళ్ల నిర్మాణాలను పూర్తి చేసుకునేందుకు ఉప్పల చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో సిమెంట్‌ను అందజేశారు. రాష్ట్ర మిషన్ భగీరథ మాజీ వైస్ చైర్మన్, బీఆర్‌ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు, ఉప్పల చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ ఉప్పల వెంకటేష్ సహకారంతో ఈ కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా గ్రామానికి చెందిన నాగిళ్ల వెంకటయ్య, పోతరపల్లి పరమేష్, పోతరపల్లి గెలువమ్మ, పోతరపల్లి సైదులు కుటుంబాలకు ఇళ్ల నిర్మాణం కోసం సిమెంట్‌ను అందజేశారు.ఈ సందర్భంగా…

యువతకు ఉద్యోగ అవకాశాలే లక్ష్యం : జాబ్ డ్రైవ్ లు కొనసాగిస్తా – సుంకి రెడ్డి రాఘవేందర్ రెడ్డి

తుక్కుగూడ: నిరుద్యోగ యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా జాబ్‌ డ్రైవ్‌లు నిరంతరం కొనసాగిస్తామని ఐక్యత ఫౌండేషన్ చైర్మన్, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు, టాస్క్ సీఓఓ సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి అన్నారు.తుక్కుగూడలోని ప్రముఖ ఎలక్ట్రానిక్ కంపెనీలో నిర్వహించిన జాబ్‌ డ్రైవ్ ఇంటర్వ్యూకు కల్వకుర్తి నియోజకవర్గంలోని వివిధ మండలాల నుంచి 20 మంది నిరుద్యోగ యువత హాజరయ్యారు. ఈ సందర్భంగా సుంకిరెడ్డి మాట్లాడుతూ, యువతకు అందుబాటులోకి వచ్చే ప్రతి ఉద్యోగ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని తమ…

గోలి గోపాల్ రెడ్డికి కన్నీటి వీడ్కోలు.. నివాళులర్పించిన సర్పంచ్ ప్రసాద్ గౌడ్

వెల్దండ: మండలంలోని అంకమోనికుంట గ్రామానికి చెందిన గోలి గోపాల్‌రెడ్డి (55) ఇటీవల హైదరాబాద్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు.విషయం తెలుసుకున్న గ్రామ సర్పంచ్ సత్తూరి ప్రసాద్‌గౌడ్ బాధిత కుటుంబాన్ని పరామర్శించి,గోపాల్‌రెడ్డి పార్థివదేహానికి నివాళులర్పించారు.ఈ సందర్భంగా కుటుంబ సభ్యులను ఓదార్చి, ఈ విషాద సమయంలో కాంగ్రెస్ పార్టీ అన్ని విధాలుగా అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. గోపాల్‌రెడ్డి మృతి పట్ల సంతాపం వ్యక్తం చేస్తూ, కుటుంబ సభ్యులకు దేవుడు మనోధైర్యాన్ని ప్రసాదించాలని ప్రార్థించారు.కార్యక్రమంలో ఉప సర్పంచ్ రామకృష్ణ,…

విద్యుత్ కోతలపై భగ్గుమన్న బీఆర్ఎస్.. రావిచెడు సబ్ స్టేషన్ ముందు మెరుపు ధర్నా

రావిచెడు సబ్‌స్టేషన్‌ ముట్టడి.. రైతులతో కలిసి ఉప్పల వెంకటేష్ ధర్నాకల్వకుర్తి: విద్యుత్ కోతలను నిరసిస్తూ బీఆర్‌ఎస్ ఆధ్వర్యంలో రావిచెడు విద్యుత్ సబ్‌స్టేషన్‌ను ముట్టడించి మెరుపు ధర్నా నిర్వహించారు. మాజీ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్‌తో కలిసి బీఆర్‌ఎస్ నాయకుడు, మాజీ మిషన్ భగీరథ వైస్ చైర్మన్ ఉప్పల వెంకటేష్ ఆందోళనలో పాల్గొన్నారు.రైతులకు నిరంతర విద్యుత్ సరఫరా చేయకపోవడంతో పంటలు ఎండిపోతున్నాయని నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. రైతుల సమస్యలను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ రైతులతో కలిసి…

పూణే ఒప్పందానికి నాంది.. అంబేద్కర్ – గాంధీ చారిత్రక భేటీ

సెప్టెంబర్ 22 ప్రత్యేకం: 1932 సెప్టెంబర్ 22న పూణేలోని ఎరవాడ జైలులో డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్, మహాత్మా గాంధీజీ మధ్య జరిగిన చారిత్రక భేటీ పూణే ఒప్పందానికి నాంది పలికింది. కమ్యూనల్ అవార్డు ద్వారా అణగారిన వర్గాలకు ప్రత్యేక నియోజకవర్గాలు కల్పించడాన్ని అంబేడ్కర్ సమర్థించగా, గాంధీజీ దీనిని వ్యతిరేకిస్తూ సెప్టెంబర్ 20న ఆమరణ నిరాహార దీక్ష చేపట్టారు.గాంధీజీ ఆరోగ్యం క్షీణిస్తున్న నేపథ్యంలో అంబేడ్కర్‌తో జరిగిన చర్చలు కీలకంగా మారాయి. అణగారిన వర్గాలకు రాజకీయ ప్రాతినిధ్యం, రిజర్వేషన్ వంటి…

సిలోనిబండ తండా గణేష్ ఉత్సవాలకు సర్పంచ్ కొండల్ యాదవ్ చేయూత

వెల్దండ: శిలోనిబండ తండా గ్రామంలో గణేష్ నవరాత్రి ఉత్సవాల సందర్భంగా ఏర్పాటు చేసిన గణేష్ మండపాన్ని గ్రామ సర్పంచ్ తగుళ్ల కొండల్ యాదవ్సందర్శించారు.గణేష్ నవరాత్రి ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు తనవంతు సహకారంగా మండప నిర్వాహకులకు రూ.5,000/- విరాళాన్ని సర్పంచ్ కొండల్ యాదవ్ అందజేశారు.ఈ సందర్భంగా మండప నిర్వాహకులు, మున్నా సాదు యూత్ సభ్యులు సర్పంచ్ కొండల్ యాదవ్‌కు కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో మున్నా సాదు యూత్ సభ్యులు, యువ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

రిమ్స్ ఘటనపై ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్ ఆగ్రహం

ఆదిలాబాద్: రిమ్స్‌ నియోనేటల్‌ వార్డులో ఏసీ సిలిండర్‌ పేలిన ఘటనలో శిశువులు మృతి చెందడంపై బీఆర్‌ఎస్‌ నేత ఆర్‌.ఎస్‌. ప్రవీణ్‌ కుమార్‌ తీవ్రంగా స్పందించారు. ట్విట్టర్‌ వేదికగా ఘటనపై ఆవేదన వ్యక్తం చేస్తూ, దీనిపై సిట్టింగ్‌ జడ్జితో సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్‌ చేశారు. చిన్నారుల ప్రాణాలకు భద్రత కల్పించడంలో ప్రభుత్వ యంత్రాంగం విఫలమైందని ఆయన విమర్శించారు. ప్రమాదం జరిగిన తర్వాత ఆదేశాలు ఇవ్వడం కంటే ముందస్తు పర్యవేక్షణ, భద్రతా చర్యలే ముఖ్యమని పేర్కొన్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో…

భానురులో కులరక్కసి

పటాన్‌చెరు, సెప్టెంబర్ 22: బీడీఎల్‌ భానురు గ్రామంలో దళిత మహిళ గృహ నిర్మాణానికి అడ్డంకులు సృష్టిస్తున్నారన్న ఆరోపణలు తీవ్ర కలకలం రేపుతున్నాయి. ఎస్సీ వర్గానికి చెందిన చేవెళ్ల స్వరూప తన సొంత స్థలంలో ఇల్లు నిర్మించుకుంటుండగా, కొందరు వ్యక్తులు కుల వివక్షతో నిర్మాణాన్ని అడ్డుకుంటున్నారని ఆమె ఆరోపించారు. ఇంటి నిర్మాణానికి అవసరమైన సామగ్రి తీసుకువచ్చే ట్రాక్టర్లను సీసీ రోడ్డుపై అడ్డంగా నిలిపి, రాకపోకలకు ఉద్దేశపూర్వకంగా ఆటంకాలు సృష్టిస్తున్నారని తెలిపారు. ఒక దళిత మహిళ తన సొంత స్థలంలో…