తలకొండపల్లి లో గ్యాస్ సిలిండర్ల కొరత .!
- మైసమ్మ కాలనీ గణనాధుని సన్నిధిలో మహా అన్నదానం - September 22, 2026
- జూరాల నీటి విషయంలో రైతులను తప్పుతోవ పట్టించొద్దు – మంత్రి జూపల్లి కృష్ణారావు - September 22, 2026
- తలకొండపల్లి లో గ్యాస్ సిలిండర్ల కొరత .! - September 22, 2026
వినియోగదారుల తీవ్ర ఇబ్బందులు – సరఫరా పునరుద్ధరించాలని విజ్ఞప్తి
తలకొండపల్లి: మండలంలో హెచ్‌పీ గ్యాస్ సిలిండర్ల కొరతతో వినియోగదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సాధారణంగా సుమారు 25 రోజులకు ఒకసారి సిలిండర్ అందాల్సి ఉండగా, బుకింగ్ చేసిన అనంతరం డీలర్‌ను సంప్రదిస్తే ప్రస్తుతం నిల్వలు లేవని సమాధానం వస్తోందని వినియోగదారులు చెబుతున్నారు.దీంతో వంట గ్యాస్ కోసం ప్రజలు రోజుల తరబడి ఎదురుచూడాల్సిన పరిస్థితి నెలకొంది. సంబంధిత అధికారులు స్పందించి గ్యాస్ సిలిండర్ల సరఫరాను పునరుద్ధరించి, వినియోగదారులకు సకాలంలో సిలిండర్లు అందేలా చర్యలు తీసుకోవాలని మండల ప్రజలు కోరుతున్నారు.
