కొల్లాపూర్ లో టూరిజం హోటల్ నిర్మాణానికి అడుగులు- 2.31 ఎకరాల ప్రభుత్వ భూమి అప్పగింత

కొల్లాపూర్‌లో హరిత హోటల్ నిర్మాణానికి మార్గం సుగమమైంది. చౌటబెట్ల శివారులోని సర్వే నంబర్‌ 72లో 2.31 ఎకరాల ప్రభుత్వ భూమిని పర్యాటక శాఖకు రెవెన్యూ అధికారులు అప్పగించారు.జిల్లా కలెక్టర్‌ హేమంత్‌ కేశవ్‌ పాటిల్ ఆదేశాల మేరకు కొల్లాపూర్‌ MRO మాధవి, RI బాలకోటి, GPO శివ సమక్షంలో జిల్లా పర్యాటక శాఖ అధికారి కల్వరాల నరసింహకు భూమికి సంబంధించిన పత్రాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్‌ పార్టీ నాయకులు వంగ రాజశేఖర్‌ గౌడ్ పాల్గొన్నారు. మంత్రి జూపల్లి…

భక్తిశ్రద్ధలతో గణపతి నవరాత్రి ఉత్సవాలు

భక్తిశ్రద్ధలతో గణపతి నవరాత్రి ఉత్సవాలుజ్ఞాన తెలంగాణ, కట్టంగూర్: వినాయకుడి ఆశీస్సులతో ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి దైద రవీందర్ ఆకాంక్షించారు. మంగళవారం కట్టంగూర్ మండలం పామనగుండ్లలో గణపతి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా బండారు ఆనంద్ ఏర్పాటు చేసిన వినాయక విగ్రహాన్ని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా దైద రవీందర్ మాట్లాడుతూ గణనాథుడి ఆశీస్సులు ప్రతి ఒక్కరిపై ఉండాలని కోరారు. భక్తిశ్రద్ధలతో ఉత్సవాలు నిర్వహించడం అభినందనీయమన్నారు. కార్యక్రమంలో…

రిలీఫ్ యూత్ ఆధ్వర్యంలో ఘనంగా అన్న ప్రసాద వితరణ

ఆమనగల్: పట్టణంలో రిలీఫ్ యూత్ ఆధ్వర్యంలో అన్నప్రసాద వితరణ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ పత్యా నాయక్, వైస్ చైర్మన్ గీత ఆచారి, మున్సిపల్ కౌన్సిలర్లు, వివిధ రాజకీయ పార్టీల నాయకులు, పట్టణ ప్రజలు పాల్గొని అన్నప్రసాద కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.ఈ సందర్భంగా కౌన్సిలర్లు పాపిశెట్టి రాము, ముక్తాల వెంకటయ్య, ఎర్రవోలు మహేష్, అనూష, శ్రీశైలం, NNR జగన్, ఎనుముల రమేష్, కో-ఆప్షన్ సభ్యుడు అల్లాజి గౌడ్, కండె భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.రిలీఫ్…

జూరాలకు నీటి విడుదలపై కర్ణాటకతో సంప్రదింపులు – సీఎం రేవంత్ రెడ్డితో మంత్రుల భేటీ

జూరాల ప్రాజెక్టుకు నీటి విడుదల అంశంపై కర్ణాటక ప్రభుత్వంతో జరపనున్న సంప్రదింపుల నేపథ్యంలో తెలంగాణ మంత్రులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిశారు.హైదరాబాద్ లోని డా. బీఆర్ అంబేద్కర్ సచివాలయంలో మంత్రులు జూపల్లి కృష్ణారావు, ఉత్తమ్ కుమార్ రెడ్డి, వాకిటి శ్రీహరి మరియు ఎమ్మెల్యేలు బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, మధుసూదన్ రెడ్డి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు.ఈ సందర్భంగా జూరాలకు నీటి విడుదలపై కర్ణాటక ప్రభుత్వంతో జరపాల్సిన సంప్రదింపులపై చర్చించినట్లు మంత్రి జూపల్లి కృష్ణారావు తన ఇన్స్టాగ్రామ్…

జాతీయస్థాయి ఫుట్బాల్ పోటీలకు కల్వకుర్తి అక్షర ఎంపిక

కల్వకుర్తి: మండలంలోని మాచర్ల గ్రామానికి చెందిన అక్షర జాతీయస్థాయి ఫుట్‌బాల్ ఛాంపియన్‌షిప్ పోటీలకు ఎంపికైంది. ఈ సందర్భంగా అక్షర మాట్లాడుతూ.. తల్లిదండ్రుల సహకారంతో పాటు కోచ్‌ ప్రోత్సాహంతో ఫుట్‌బాల్ క్రీడలో ప్రతిభను మెరుగుపరుచుకున్నట్లు తెలిపింది.ఇప్పటికే రాష్ట్ర, జాతీయస్థాయి ఫుట్‌బాల్ పోటీల్లో పాల్గొన్నట్లు అక్షర పేర్కొంది. జాతీయస్థాయి పోటీలకు ఎంపిక కావడం పట్ల గ్రామస్తులు, క్రీడాభిమానులు అభినందనలు తెలిపారు.

మిషన్ భగీరథ పంప్ హౌస్ వద్ద ఎమ్మెల్యే డా. కూచుకుళ్ల రాజేష్ రెడ్డి ఆకస్మిక తనిఖీ

నాగర్ కర్నూల్:నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లో తాగునీటి సరఫరాలో అంతరాయం ఏర్పడుతున్న నేపథ్యంలో ఎమ్మెల్యే డాక్టర్ కూచుకుళ్ల రాజేష్ రెడ్డి గారు మిషన్ భగీరథ పంప్ హౌస్ ను సందర్శించి సమీక్షించారు.ఈ సందర్భంగా పంప్ హౌస్ వద్ద నీటి సరఫరాలో ఎదురవుతున్న సాంకేతిక సమస్యలు, పైప్ లైన్ల పరిస్థితి, పంపింగ్ సామర్థ్యం, సరఫరాలో అంతరాయాలకు గల కారణాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు.నియోజకవర్గంలో పలు చోట్ల తక్కువ ప్రెజర్ తో నీరు రావడం, నీటి సరఫరా సక్రమంగా జరగకపోవడంపై లైన్…

మిట్టపల్లి మురళయ్య కు ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు

మిట్టపల్లి మురళయ్య కు ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు జ్ఞాన తెలంగాణ, కట్టంగూర్, సెప్టెంబర్ 22 : మండల పరిధిలోని దుగినవెల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో గణితం ఉపాధ్యాయునిగా పనిచేస్తున్న మిట్టపల్లి మురళయ్య కు జిల్లా స్థాయిలో ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు లభించింది. మంగళవారం జిల్లా కేంద్రంలో జరిగిన కార్యక్రమంలో రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, కలెక్టర్ బడుగు చంద్రశేఖర్ ల చేతులమీదుగా ఉత్తమ అవార్డు అందుకున్నారు. విధి నిర్వహణలో నిక్కచ్చిగా ఉండే…

మైసమ్మ కాలనీ గణనాధుని సన్నిధిలో మహా అన్నదానం

కడ్తాల్, సెప్టెంబర్ 22: కడ్తాల్ మండల కేంద్రంలో నిర్వహిస్తున్న గణేష్ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా రెండో వార్డు, మైసమ్మ కాలనీలో మంగళవారం అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. డీసీసీ ఉపాధ్యక్షుడు గూడూరు శ్రీనివాస్ రెడ్డి, సర్పంచ్ బిక్షపతి, సింగిల్ విండో చైర్మన్ గంప వెంకటేష్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు యాట నరసింహ కలిసి అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు.ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు జాంగీర్, బాబా, మంకీ మహేష్, ముత్తి కృష్ణ, మాజీ సర్పంచ్ వేణు పంతులు, కాలనీవాసులు, తదితరులు…

నాగర్ కర్నూల్ లో PNB నూతన శాఖ ప్రారంభం!

జిల్లా కేంద్రంలో నూతనంగా ఏర్పాటు చేసిన పంజాబ్ నేషనల్ బ్యాంక్ శాఖను జిల్లా కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్, IAS గారు, మున్సిపల్ చైర్మన్ తీగల సునేంద్ర కుమార్ గారు ప్రారంభించారు. ప్రజలకు మెరుగైన బ్యాంకింగ్ సేవలు అందుతాయని చైర్మన్ తెలిపారు. కార్యక్రమంలో బ్యాంక్ సిబ్బంది, కౌన్సిలర్ అవాంచ మాధవి రాజు పాల్గొన్నారు.

జూరాల నీటి విషయంలో రైతులను తప్పుతోవ పట్టించొద్దు – మంత్రి జూపల్లి కృష్ణారావు

నాగర్ కర్నూల్: జూరాల ప్రాజెక్టు నీటి విడుదల విషయంలో రైతులను తప్పుదోవ పట్టించేలా రాజకీయ ఆరోపణలు చేయొద్దని మంత్రి జూపల్లి కృష్ణారావు సూచించారు. ప్రాజెక్టులో నీటి నిల్వలు, ఇన్‌ఫ్లో, అవుట్‌ఫ్లో, బాష్పీభవనం, కర్ణాటకలో వర్షపాతం, అక్కడి ప్రాజెక్టుల పరిస్థితులను పరిగణనలోకి తీసుకుని నీటి నిర్వహణ చేపట్టాల్సి ఉంటుందని తెలిపారు. రైతుల పంటలను కాపాడేందుకు అందుబాటులో ఉన్న నీటిని ప్రణాళికాబద్ధంగా వినియోగిస్తున్నామని, నీటి విషయంలో రాజకీయాల కంటే వాస్తవాలు, లెక్కలు, శాస్త్రీయ విధానమే ముఖ్యమని మంత్రి పేర్కొన్నారు.