కల్వకుర్తి నియోజకవర్గంలో విద్యుత్ కోతలపై బీఆర్ఎస్ మెరుపు ధర్నా
- జూరాలకు నీటి విడుదలపై కర్ణాటకతో సంప్రదింపులు – సీఎం రేవంత్ రెడ్డితో మంత్రుల భేటీ - September 22, 2026
- మిషన్ భగీరథ పంప్ హౌస్ వద్ద ఎమ్మెల్యే డా. కూచుకుళ్ల రాజేష్ రెడ్డి ఆకస్మిక తనిఖీ - September 22, 2026
- నాగర్ కర్నూల్ లో PNB నూతన శాఖ ప్రారంభం! - September 22, 2026
కల్వకుర్తి నియోజకవర్గం కడ్తాల్ మండలం రావిచెడు విద్యుత్ సబ్ స్టేషన్ ను బీఆర్ఎస్ నాయకులు ముట్టడించారు.
కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక 3 ఏళ్లుగా రైతులకు విద్యుత్ కోతలు పెరిగి పంటలు ఎండిపోతున్నా రేవంత్ రెడ్డి సర్కార్ పట్టించుకోవడం లేదని నిరసిస్తూ మాజీ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ తో కలిసి రాష్ట్ర మిషన్ భగీరథ మాజీ వైస్ చైర్మన్ ఉప్పల వెంకటేష్ రోడ్డుపై బైఠాయించి రైతులతో కలిసి ధర్నా చేశారు.ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీ దశరత్ నాయక్, ఎల్.ఎన్. రెడ్డి, గంప వెంకటేష్, మాజీ ప్రజాప్రతినిధులు, వివిధ గ్రామాల సర్పంచులు, రైతులు పాల్గొన్నారు.
