గాంధీ జయంతినాడే మద్యం అమ్మకాలు..!
మల్కాపూర్ టీచర్స్ కాలనీలో జోరుగా విక్రయాలు.. అధికారుల పర్యవేక్షణ ఏదీ?
మల్కాపూర్ టీచర్స్ కాలనీలో జోరుగా విక్రయాలు.. అధికారుల పర్యవేక్షణ ఏదీ?
ఎల్ నినో కారణంగా ఎండిపోయిన పంటలకు ప్రభుత్వం ఎకరాకు 50 వేల రూపాయలు చొప్పున పరిహారం ఇవ్వాలని రైతు సంఘ నాయకులు మైపాల్ డిమాండ్ చేశారు. శుక్రవారం వికారాబాద్ జిల్లా మోమిన్ పేట్ మండలం బూరుగుపల్లి గ్రామంలో మోమిన్ పేట్ మండల గ్రామలలో పంట పొలాలలో పర్యటించి రైతులతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. రైతులు సంక్షోభంలో ఉన్నారని వారు పేర్కొన్నారు. ప్రభుత్వం రైతులకు పంట నష్టపరిహారం అందించి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.
సుమారు రూ.లక్ష కోట్ల అంచనా వ్యయంతో ఈ హబ్ను అభివృద్ధి చేయనున్నారు. ఇందులో రూ.40 వేల కోట్లు కేంద్ర ప్రభుత్వ సహకారంతో, మరో రూ.60 వేల కోట్లు ప్రైవేటు పెట్టుబడుల ద్వారా సమీకరించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.
జనగామలో పీఎం సూర్య ఘర్ యోజనపై అవగాహన సదస్సు
వికారాబాద్ : ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రసిద్ధ పర్యాటక ప్రాంతమైన అనంతగిరి కొండల వద్ద ఓ ప్రైవేట్ బస్సు అదుపుతప్పి లోయలో పడిపోయింది. ఈ ప్రమాదంలో పలువురు ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు.బస్సు అనంతగిరి నుంచి తాండూరు వైపు వెళ్తుండగా ఈ ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ఘాట్ రోడ్డుపై ప్రయాణిస్తున్న సమయంలో అకస్మాత్తుగా బస్సు డ్రైవర్ నియంత్రణ కోల్పోవడంతో, వాహనం రోడ్డు పక్కన ఉన్న లోయలోకి దూసుకెళ్లింది. బస్సులో ఉన్న ప్రయాణికులంతా ఒక్కసారిగా హాహాకారాలు చేశారు.ప్రమాదం జరిగిన…
శనివారం జరిగిన మహిళల వ్యక్తిగత రికర్వ్ ఫైనల్లో 17 ఏళ్ల కుంకుమ్ స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకుంది. ఆసియా క్రీడల చరిత్రలోనే మహిళల వ్యక్తిగత రికర్వ్ విభాగంలో భారత్కు ఇదే తొలి స్వర్ణ పతకం కావడం విశేషం. హోరాహోరీగా సాగిన ఫైనల్ పోరులో దక్షిణ కొరియా బలమైన ఆర్చర్ ఓ యెజిన్పై షూటౌట్లో 6-5 తేడాతో కుంకుమ్ అద్భుత విజయం సాధించింది.
ఆమనగల్లు: కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి హైదరాబాద్లోని తన నివాసంలో పలువురు లబ్ధిదారులకు సీఎం సహాయనిధి (సీఎంఆర్ఎఫ్) చెక్కులు, ఎల్ఓసీ పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా పలువురు ముఖ్య నాయకులు, ప్రజాప్రతినిధులను శాలువాలతో సత్కరించి అభినందించారు.అనంతరం ఆమనగల్లు పట్టణంలోని వెంటతండాలో రూ.75 లక్షల అంచనా వ్యయంతో చేపట్టనున్న సీసీ రోడ్డు నిర్మాణ పనులకు ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు. అనంతరం ఆమనగల్లు ప్రభుత్వ ఆసుపత్రి భవన నిర్మాణ పనులను పరిశీలించారు. అలాగే బస్టాండ్ పరిసర ప్రాంతాల్లో రహదారి పక్కన…
గ్రామపంచాయతీ కార్మికులకు దుస్తుల పంపిణీజ్ఞాన తెలంగాణ, కట్టంగూర్, అక్టోబర్ 3 : వృద్ధాప్య దినోత్సవాన్ని పురస్కరించుకొని లయన్స్ క్లబ్ ఆఫ్ కట్టంగూర్ కింగ్స్ ఆధ్వర్యంలో, లయన్ గుడిపాటి శివప్రసాద్–పద్మ దంపతుల సహకారంతో శనివారం గ్రామపంచాయతీ కార్మికులకు దుస్తులను పంపిణీ చేశారు.ఈ సందర్భంగా సర్పంచ్ ముక్కాముల శ్యామల శేఖర్ మాట్లాడుతూ.. గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచడంలో పారిశుద్ధ్య కార్మికుల సేవలు ఎంతో కీలకమని అన్నారు. ఎండ, వానలను లెక్కచేయకుండా ప్రజల ఆరోగ్యం, పరిశుభ్రత కోసం పనిచేస్తున్న కార్మికులను గౌరవించడం ప్రతి…
కామారెడ్డి జిల్లా బివి పేట మండలంలో గత ప్రభుత్వాల నుంచి ప్రతిపక్షంలో ఉండి ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొంటూ దీటుగా రాజకీయాల్లో ముందుకు సాగుతూ బీబీపేట మండల అధ్యక్షునిగా పనిచేసే ఇప్పుడు తమ కాంగ్రెస్ ప్రభుత్వం దృష్టిలో మహ్మద్ షబ్బీర్ అలీ దృష్టిలో మంచి గుర్తింపు తెచ్చుకొని ఈరోజు బీబీపేట మండలంలో పీఏసీస్ చైర్మన్ గా ఆర్డర్ కాపీ అందుకుంటున్న బీబీపేట్ సొసైటీ చైర్మన్ సుతారి రమేష్ కు పలు నాయకులు కార్యకర్తలు శుభాకాంక్షలు తెలియజేశారు అలాగే జంగంపల్లి…
కామారెడ్డి పట్టణంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కామారెడ్డి జిల్లా కేంద్రానికి చెందిన *ఫిర్దోస్ బేగం* అనే గర్భిణీ మహిళకి ఆపరేషన్ నిమిత్తం అత్యవసరంగా *ఏబి పాజిటివ్* రక్తం అవసరం కావడంతో పేషంట్ కుటుంబసభ్యులు *జిల్లా రక్తదాతల సేవా సమితి* నిర్వాహకులను సంప్రదించడంతో ఒక్క ఫోన్ కాల్ తో వెంటనే స్పందించిన భిక్నూర్ మండలం కాచాపూర్ గ్రామానికి చెందిన *బండారి సురేష్* గారు ఒక ప్రాణాన్ని కాపాడాలనే ఉద్దేశంతో వెంటనే వచ్చి రక్తం ఇవ్వడం జరిగింది. ఈ…