గాంధీ జయంతినాడే మద్యం అమ్మకాలు..!

1423845.jpg

జ్ఞాన తెలంగాణ, కొండాపూర్: గాంధీ జయంతి సందర్భంగా డ్రై డేగా పాటించాల్సిన రోజునే సంగారెడ్డి జిల్లా కొండాపూర్‌ మండలం మల్కాపూర్‌ టీచర్స్‌ కాలనీలో మద్యం విక్రయాలు జరుగుతున్నాయనే ఆరోపణలు వెలువడుతున్నాయి. మద్యం బాటిళ్లు బహిరంగంగా కనిపిస్తున్న దృశ్యాలు స్థానికంగా చర్చనీయాంశంగా మారాయి.

డ్రై డే నిబంధనలు అమలులో ఉన్నప్పటికీ మద్యం విక్రయాలు ఎలా సాగుతున్నాయనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అధికారుల పర్యవేక్షణ లేదా? ఎక్సైజ్‌ శాఖ అధికారులు ఎక్కడ? నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తీసుకునే పరిస్థితి లేదా? అంటూ స్థానికులు ప్రశ్నిస్తున్నారు.

గాంధీ జయంతి రోజునే ఇలాంటి పరిస్థితులు కనిపించడం అధికారుల తనిఖీలపై అనుమానాలకు తావిస్తోంది. వెంటనే అధికారులు స్పందించి మల్కాపూర్‌ టీచర్స్‌ కాలనీలో మద్యం విక్రయాలపై విచారణ చేపట్టి, నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు1423896.jpg

.

You may also like...