ఆసియా క్రీడల్లో భారత్ సరికొత్త చరిత్ర: రికర్వ్ ఆర్చేరీలో పసిడి పతకం ముద్దాడిన 17 ఏళ్ల కుంకుమ్ మోహొద్.
- మదనపల్లెలో రూ.లక్ష కోట్ల గ్లోబల్ హార్టికల్చర్ హబ్‌కు శంకుస్థాపన. - October 4, 2026
- వికారాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. - October 4, 2026
- ఆసియా క్రీడల్లో భారత్ సరికొత్త చరిత్ర: రికర్వ్ ఆర్చేరీలో పసిడి పతకం ముద్దాడిన 17 ఏళ్ల కుంకుమ్ మోహొద్. - October 4, 2026

జపాన్):ఆసియా క్రీడల ఆర్చేరీలో భారత యువ సంచలనం కుంకుమ్ మోహొద్ సరికొత్త చరిత్ర సృష్టించింది. శనివారం జరిగిన మహిళల వ్యక్తిగత రికర్వ్ ఫైనల్‌లో 17 ఏళ్ల కుంకుమ్ స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకుంది. ఆసియా క్రీడల చరిత్రలోనే మహిళల వ్యక్తిగత రికర్వ్ విభాగంలో భారత్‌కు ఇదే తొలి స్వర్ణ పతకం కావడం విశేషం. హోరాహోరీగా సాగిన ఫైనల్ పోరులో దక్షిణ కొరియా బలమైన ఆర్చర్ ఓ యెజిన్‌పై షూటౌట్‌లో 6-5 తేడాతో కుంకుమ్ అద్భుత విజయం సాధించింది.
ఒత్తిడిని జయించి.
మైండ్ గేమ్‌గా సాగిన ఈ ఫైనల్ మ్యాచ్ చివరి వరకు ప్రేక్షకులను ఉత్కంఠకు గురిచేసింది. మ్యాచ్‌లో ఒక దశలో కుంకుమ్ 3-5తో వెనుకబడింది. అయితే ఎంతమాత్రం ఒత్తిడికి లోనవ్వకుండా, అసాధారణ ప్రదర్శనతో వరుసగా మూడు సార్లు పర్ఫెక్ట్ 10 పాయింట్లు సాధించి స్కోరును 5-5తో సమం చేసింది. దీంతో విజేతను తేల్చేందుకు మ్యాచ్ షూటౌట్‌కు దారితీసింది. షూటౌట్‌లో దక్షిణ కొరియా ఆర్చర్ ఓ యెజిన్ 8 పాయింట్లు మాత్రమే సాధించగా, కుంకుమ్ మరోసారి పర్ఫెక్ట్ 10 స్కోర్ చేసి స్వర్ణాన్ని ముద్దాడింది.
ఈ టోర్నీలో కుంకుమ్ ప్రయాణం ఆసాంతం అద్భుతంగా సాగింది. క్వార్టర్ ఫైనల్‌లో దక్షిణ కొరియాకు చెందిన కాంగ్ చాయోంగ్‌ను, సెమీఫైనల్‌లో చైనా ఆర్చర్ జు జింగీని ఓడించి ఆమె ఫైనల్‌కు దూసుకెళ్లింది. ప్రస్తుత ఆసియా క్రీడల్లో కుంకుమ్‌కు ఇది మూడో పతకం. శుక్రవారం జరిగిన మహిళల టీమ్ ఈవెంట్‌లో అంకితా భగత్, కీర్తి శర్మలతో కలిసి ఆమె బంగారు పతకం గెలవగా. మిక్స్‌డ్ టీమ్ విభాగంలో ధీరజ్ బొమ్మదేవరతో కలిసి రజత పతకాన్ని సొంతం చేసుకుంది.
ఈ చారిత్రక విజయంతో కుంకుమ్ మోహొద్ లాస్ ఏంజిల్స్ 2028 ఒలింపిక్స్‌కు భారత్ తరఫున వ్యక్తిగత కోటా స్థానాన్ని (Quota Place) కూడా ఖరారు చేసింది.
కుంకుమ్ సాధించిన స్వర్ణంతో కలిపి ప్రస్తుత ఆసియా క్రీడల్లో భారత్ పతకాల వేట జోరుగా సాగుతోంది. తాజా సమాచారం ప్రకారం, భారత్ మొత్తం 77 పతకాలతో (17 స్వర్ణాలు, 25 రజతాలు, 35 కాంస్యాలు) పట్టికలో దూసుకుపోతోంది. చారిత్రక విజయం సాధించిన యువ ఆర్చర్ కుంకుమ్‌పై దేశవ్యాప్తంగా ప్రశంసల జల్లు కురుస్తోంది.
