వికారాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.
- కిస్మాత్పూర్ డివిజన్ 122 పరిధిలోని కాళికా నగర్ కాలనీలో దేవీ శరన్నవరాత్రి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. - October 15, 2026
- మైలార్‌దేవ్‌పల్లిలో రూ. 1.78 కోట్లతో సీసీ రోడ్ల పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ - October 13, 2026
- లక్ష్మీనగర్ కాలనీ పార్కులో ఓపెన్ జిమ్, ప్లే ఏరియాలను ప్రారంభించిన ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ - October 13, 2026

వికారాబాద్ : ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రసిద్ధ పర్యాటక ప్రాంతమైన అనంతగిరి కొండల వద్ద ఓ ప్రైవేట్ బస్సు అదుపుతప్పి లోయలో పడిపోయింది. ఈ ప్రమాదంలో పలువురు ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు.
బస్సు అనంతగిరి నుంచి తాండూరు వైపు వెళ్తుండగా ఈ ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ఘాట్ రోడ్డుపై ప్రయాణిస్తున్న సమయంలో అకస్మాత్తుగా బస్సు డ్రైవర్ నియంత్రణ కోల్పోవడంతో, వాహనం రోడ్డు పక్కన ఉన్న లోయలోకి దూసుకెళ్లింది. బస్సులో ఉన్న ప్రయాణికులంతా ఒక్కసారిగా హాహాకారాలు చేశారు.
ప్రమాదం జరిగిన వెంటనే గమనించిన స్థానికులు, వాహనదారులు మానవత్వంతో స్పందించారు. వెంటనే లోయలోకి దిగి క్షతగాత్రులను బస్సులో నుంచి బయటకు తీసేందుకు ముమ్మరంగా ప్రయత్నిస్తున్నారు. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు, రెస్క్యూ టీమ్, అంబులెన్స్‌లు ఘటనా స్థలానికి చేరుకుంటున్నాయి. గాయపడిన వారిని చికిత్స నిమిత్తం సమీప ఆసుపత్రికి తరలిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.ప్రసిద్ధ పర్యాటక ప్రాంతమైన అనంతగిరి కొండల వద్ద ఓ ప్రైవేట్ బస్సు అదుపుతప్పి లోయలో పడిపోయింది. ఈ ప్రమాదంలో పలువురు ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు.
బస్సు అనంతగిరి నుంచి తాండూరు వైపు వెళ్తుండగా ఈ ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ఘాట్ రోడ్డుపై ప్రయాణిస్తున్న సమయంలో అకస్మాత్తుగా బస్సు డ్రైవర్ నియంత్రణ కోల్పోవడంతో, వాహనం రోడ్డు పక్కన ఉన్న లోయలోకి దూసుకెళ్లింది. బస్సులో ఉన్న ప్రయాణికులంతా ఒక్కసారిగా హాహాకారాలు చేశారు.
ప్రమాదం జరిగిన వెంటనే గమనించిన స్థానికులు, వాహనదారులు మానవత్వంతో స్పందించారు. వెంటనే లోయలోకి దిగి క్షతగాత్రులను బస్సులో నుంచి బయటకు తీసేందుకు ముమ్మరంగా ప్రయత్నిస్తున్నారు. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు, రెస్క్యూ టీమ్, అంబులెన్స్‌లు ఘటనా స్థలానికి చేరుకుంటున్నాయి. గాయపడిన వారిని చికిత్స నిమిత్తం సమీప ఆసుపత్రికి తరలిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.
