ఆమనగల్లులో అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి శంకుస్థాపన
- ఆమనగల్లులో అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి శంకుస్థాపన - October 4, 2026
- కొట్రలో ఐదు కుటుంబాలకు ఉప్పల ట్రస్ట్ ఆర్థిక చేయూత.. సిమెంట్ అందజేత - October 4, 2026
- మృతురాలి కుటుంబానికి గోలి శ్రీనివాస్ రెడ్డి ఆర్థిక చేయూత - October 4, 2026

ఆమనగల్లు: కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి హైదరాబాద్‌లోని తన నివాసంలో పలువురు లబ్ధిదారులకు సీఎం సహాయనిధి (సీఎంఆర్‌ఎఫ్) చెక్కులు, ఎల్‌ఓసీ పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా పలువురు ముఖ్య నాయకులు, ప్రజాప్రతినిధులను శాలువాలతో సత్కరించి అభినందించారు.అనంతరం ఆమనగల్లు పట్టణంలోని వెంటతండాలో రూ.75 లక్షల అంచనా వ్యయంతో చేపట్టనున్న సీసీ రోడ్డు నిర్మాణ పనులకు ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు. అనంతరం ఆమనగల్లు ప్రభుత్వ ఆసుపత్రి భవన నిర్మాణ పనులను పరిశీలించారు. అలాగే బస్టాండ్ పరిసర ప్రాంతాల్లో రహదారి పక్కన ఉన్న షట్టర్లను పరిశీలించి, పట్టణంలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా రహదారులు, మౌలిక వసతుల అభివృద్ధికి చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులతో చర్చించారు.ఈ కార్యక్రమాల్లో బీజేపీ నాయకులు తల్లోజు ఆచారి,ప్రజాప్రతినిధులు, మున్సిపల్ కౌన్సిలర్లు, కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
