రిపోర్టర్, కామారెడ్డి | 919959606808
Latest posts by Dubbaka Srinivas
(see all) కామారెడ్డి పట్టణంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కామారెడ్డి జిల్లా కేంద్రానికి చెందిన *ఫిర్దోస్ బేగం* అనే గర్భిణీ మహిళకి ఆపరేషన్ నిమిత్తం అత్యవసరంగా *ఏబి పాజిటివ్* రక్తం అవసరం కావడంతో పేషంట్ కుటుంబసభ్యులు *జిల్లా రక్తదాతల సేవా సమితి* నిర్వాహకులను సంప్రదించడంతో ఒక్క ఫోన్ కాల్ తో వెంటనే స్పందించిన భిక్నూర్ మండలం కాచాపూర్ గ్రామానికి చెందిన *బండారి సురేష్* గారు ఒక ప్రాణాన్ని కాపాడాలనే ఉద్దేశంతో వెంటనే వచ్చి రక్తం ఇవ్వడం జరిగింది.
ఈ సందర్భంగా రక్తదాతల సేవా సమితి నిర్వాహకులు *బోనగిరి శివ కుమార్*, *ముదాం శ్రీధర్ పటేల్* లు మాట్లాడుతూ
*రక్తం దానం చేస్తే మళ్లీ రక్తం వస్తుంది కానీ, రక్తం అందక పోయిన ప్రాణం తిరిగి రాదు.మనం చేసే రక్తదానం వలన వెలకట్టలేని విలువైన ప్రాణం రక్షించబడుతుంది*….
యువత మానవత్వంతో స్వచ్ఛంద రక్తదానానికి ముందుకు వచ్చి ప్రాణదాతలు కావాలని తెలుపడం జరిగింది.
ఈ సందర్బంగా ఒక్క ఫోన్ కాల్ చేయగానే వచ్చి రక్తదానం చేసిన *బండారి సురేష్* కి *జిల్లా రక్తధాతల సేవా సమితి* నిర్వాహకులు *బోనగిరి శివకుమార్, ముదాం శ్రీధర్ పటేల్* లు ధన్యవాదాలు తెలిపారు.
