రిపోర్టర్, నల్గొండ | 9848771238
Latest posts by Hussain Kampally
(see all) ఇందిరమ్మ జీవిత బీమాను స్వదినియోగం చేసుకోవాలి,
జ్ఞాన తెలంగాణ /డిండి ప్రతినిధి :
గత నాలుగు రోజుల నుండి డిండి గ్రామపంచాయతీ కార్యాలయం పరిధిలోని ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం కొనసాగుతుందని జిపిఓ యాదయ్య శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. డిండి గ్రామపంచాయతీ పరిధిలోని 1700 వందల పైచిలుకు రేషన్ కార్డులో ఉన్నప్పటికీ, గత నాలుగు రోజుల నుండి 400 వందల పైచిలుకు అప్లికేషన్లు మాత్రమే వచ్చాయి, కావున ఇంకా ఎవరైతే బీమా ఆన్లైన్ నమోదు చేసుకొని వారు ఉన్నారో వారు గ్రామపంచాయతీ కార్యాలయం లో నమోదు చేసుకోవాలని అన్నారు, ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం వచ్చే నెల 18 వరకు యధావిధిగా ఆన్లైన్ ప్రక్రియ కొనసాగుతుంది కావున అర్హులైన ప్రతి ఒక్కరు ఆన్లైన్ నమోదు చేసుకోవాలని జిపిఓ యాదయ్య అన్నారు. ఆధార్ కార్డులు రేషన్ కార్డు నామిని కి సంబంధించినటువంటి పత్రాలను తీసుకు రాగలరని కోరారు.
