రిపోర్టర్, సంగారెడ్డి | 9000600737
Latest posts by MOHAMMAD MOHAMMAD
(see all) జహీరాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిని సంగారెడ్డి జిల్లా కలెక్టర్ ప్రీతిక్ జైన్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆసుపత్రిని సందర్శించి వైద్య సేవలను పరిశీలించారు. ఆసుపత్రిలో పారిశుద్ధ్యం, రోగులకు అందుతున్న వైద్య చికిత్సపై వివరాలు అడిగి తెలుసుకున్నారు.
అనంతరం నూతనంగా నిర్మిస్తున్న ఆసుపత్రి భవన నిర్మాణ పనుల పురోగతిని సమీక్షించారు. మిగిలిన పనులను త్వరితగతిన పూర్తి చేసి, నూతన భవనాన్ని ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని అధికారులను ఆదేశించారు.