రాజ్యాంగ పరిరక్షణ ప్రతి పౌరుడి బాధ్యత – మాజీ ఉపసర్పంచ్ గైని శివాజీ

సంగోజివాడి: భారత రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకుని గురువారం సంగోజివాడి గ్రామంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.

ఈ సందర్భంగా మాజీ ఉపసర్పంచ్ గైని శివాజీ మాట్లాడుతూ.. భారత రాజ్యాంగం ప్రతి పౌరుడికి సమాన హక్కులు, స్వేచ్ఛ, సామాజిక న్యాయం కల్పించిన గొప్ప ప్రజాస్వామ్య గ్రంథమని అన్నారు. కుల, మత, ప్రాంత, భాషా భేదాలు లేకుండా ప్రతి ఒక్కరికీ సమాన గౌరవం, అవకాశాలు కల్పించడమే రాజ్యాంగ ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు.
డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కృషి, దూరదృష్టి భారత ప్రజాస్వామ్యానికి బలమైన పునాది వేశాయని, రాజ్యాంగం కేవలం పుస్తకం మాత్రమే కాదని, ప్రతి పౌరుడి హక్కులకు రక్షణ కవచమని తెలిపారు. వివక్షను ప్రశ్నిస్తూ, అన్యాయాన్ని ఎదిరిస్తూ సమానత్వం, సోదరభావం, సామాజిక న్యాయం కోసం ప్రతి ఒక్కరూ ఐక్యంగా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో గంట బాలరాజు, ఎండీ ఖయ్యుమ్, ఎండీ కరామత్, మైముద్, ఎండీ ఫారూక్, హమీద్, సందీప్, భరత్ కుమార్, బాల పోషయ్య, చిన్న నర్సింలు, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు

You may also like...