పాలమూరు సాగునీటి ప్రాజెక్టులపై సీఎం స్పష్టత ఇవ్వాలి.. యువ నేత చీమల అర్జున్ రెడ్డి
- పాలమూరు సాగునీటి ప్రాజెక్టులపై సీఎం స్పష్టత ఇవ్వాలి.. యువ నేత చీమల అర్జున్ రెడ్డి - November 27, 2026
- రాజ్యాంగ విలువలను కాపాడాలి – సర్పంచ్ జంతుక వెంకటయ్య - November 27, 2026
- పరిష్కారం కోసం ఎదురుచూపులు.. పోలీసుల అరెస్టుల మధ్య కొనసాగుతున్న నిరసన - November 27, 2026

కల్వకుర్తి,నవంబర్ 26: పాలమూరు బిడ్డనని చెప్పుకునే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పాలమూరు ప్రాంత సాగునీటి సమస్యలపై స్పష్టమైన హామీ ఇవ్వాలని చీమర్ల అర్జున్ రెడ్డి డిమాండ్ చేశారు. అచ్చంపేట సభలో పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టు పెండింగ్ పనులు, కల్వకుర్తికి పూర్తిస్థాయి సాగునీరు, అచ్చంపేట రైతులకు నీటి సరఫరా, డిండి లిఫ్ట్ ప్రాజెక్టు అంశాలపై సీఎం స్పష్టత ఇవ్వలేదని విమర్శించారు.పెండింగ్ ప్రాజెక్టులను వెంటనే పూర్తి చేసి రైతులకు సాగునీరు అందించాలని, డిండి లిఫ్ట్ ప్రాజెక్టుపై ప్రభుత్వ వైఖరిని ప్రకటించాలని కోరారు. పాలమూరు రైతాంగానికి న్యాయం జరిగే వరకు తమ పోరాటం కొనసాగుతుందని చీమర్ల అర్జున్ రెడ్డి తెలిపారు.
