పోషకాహారమే ఆరోగ్యానికి ఆధారం.. అంగన్వాడి పర్యవేక్షకురాలు సరిత రెడ్డి

వెల్దండ సెప్టెంబర్ 11 : పోషకాహారమే ఆరోగ్యానికి ఆధారమని అంగన్వాడి చెర్కూర్ సెక్టార్ పర్యవేక్షకురాలు సరితా రెడ్డి అన్నారు.9వ పోషణ మాసం (సెప్టెంబర్ 09 నుండి అక్టోబర్ 08 వరకు) కార్యక్రమంలో భాగంగా చెర్కూర్ సెక్టార్ పరిధిలోని బర్కత్‌పల్లి గణ్యభావి తండా,గానుగగట్టు తండా అంగన్వాడీ కేంద్రాల్లో పోషకాహారంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా అంగన్వాడీల ద్వారా అందించే పోషకాహారాన్ని ప్రదర్శించి, స్థానికంగా లభించే చిరుధాన్యాలు, కూరగాయలు, ఆకుకూరలతో పోషక విలువలు కలిగిన ఆహారాన్ని తయారు చేసే విధానాన్ని వివరించారు. ప్రోటీన్, సమతుల్య ఆహారం ప్రాముఖ్యత, గర్భిణీలు, బాలింతలు తీసుకోవాల్సిన ఆహారం, పిల్లల ఎదుగుదలకు అవసరమైన అలవాట్లపై అవగాహన కల్పించారు.ఈ కార్యక్రమంలో బర్కత్ పల్లి సర్పంచ్ మెల్కేడి రాజు నవ్య, గానుగట్టు తండా సర్పంచ్ మౌనిక లచ్చిరాం నాయక్, ఉపసర్పంచ్ నరసింహ,సిబ్బంది ప్రమీల,సరోజ, శ్రావణి, లక్ష్మీ,పాఠశాల సిబ్బంది, గ్రామస్తులు, గర్భిణీలు, బాలింతలు పాల్గొన్నారు.

You may also like...