రాజ్యాంగ పరిరక్షణ సమరభేరి.. హైదరాబాద్‌కు జనగామ కాంగ్రెస్ సేవాదళ్ శ్రేణుల తరలింపు

భారత రాజ్యాంగ పరిరక్షణ, ప్రజాస్వామ్య విలువల కాపాడే లక్ష్యంతో టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ నాయకత్వంలో హైదరాబాద్‌లో నిర్వహిస్తున్న ‘సంవిధాన్ రక్షా మార్చ్’లో పాల్గొనేందుకు జనగామ జిల్లా కాంగ్రెస్ సేవాదళ్ నాయకులు, కార్యకర్తలు భారీగా తరలివెళ్లారు.టీపీసీసీ కాంగ్రెస్ సేవాదళ్ రాష్ట్ర అధ్యక్షుడు మిద్దెల జితేందర్ పిలుపు మేరకు, జనగామ జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు ధనవంతి లక్ష్మీనారాయణ నాయక్ ఆదేశాల మేరకు జిల్లా కాంగ్రెస్ సేవాదళ్ అధ్యక్షుడు జాయ మల్లేష్ ఆధ్వర్యంలో నాయకులు, కార్యకర్తలు హైదరాబాద్‌కు బయలుదేరారు.హైదరాబాద్‌లోని ట్యాంక్‌బండ్ వద్ద డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ విగ్రహం నుంచి నెక్లెస్ రోడ్‌లోని ఇందిరాగాంధీ విగ్రహం వరకు సంవిధాన్ రక్షా మార్చ్ నిర్వహించనున్నారు.రాజ్యాంగం కల్పించిన హక్కులు, స్వేచ్ఛ, సమానత్వం, సామాజిక న్యాయం వంటి ప్రజాస్వామ్య మూల సూత్రాలను కాపాడుకోవడం ప్రతి పౌరుడి బాధ్యత అని సేవాదళ్ నాయకులు పేర్కొన్నారు. రాజ్యాంగ పరిరక్షణ కోసం చేపడుతున్న ఉద్యమాల్లో సేవాదళ్ శ్రేణులు ముందుంటాయని తెలిపారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ సేవాదళ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సుంకర శ్రీనివాస్ రెడ్డి, రాష్ట్ర కార్యదర్శి ఆదినారాయణ, పట్టణ అధ్యక్షుడు గౌడే శ్రీనివాస్, జిల్లా ఉపాధ్యక్షులు కిషన్ నాయక్, లింగాల వెంకటరెడ్డి, ప్రధాన కార్యదర్శులు బిరు సత్యనారాయణ, మెంతుల కృష్ణయ్య, బ్లాక్ అధ్యక్షులు మొగం కృష్ణంరాజు, శివరత్నం పరశురాములు, గుగులోతు కృష్ణ నాయక్, మండల అధ్యక్షుడు గాదెపాక శ్రీధర్, జిల్లా కార్యదర్శి మోటే మల్లేష్, సేవాదళ్ నాయకులు సలేంద్ర శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారుWhatsApp Image 2026-11-26 at 18.23.34.jpeg

You may also like...