బీజేపీ జనగామ జిల్లా అధ్యక్షుడు సౌడ రమేష్
- రెడ్‌క్రాస్ సొసైటీ ఎన్నికల నామినేషన్ల స్వీకరణ పూర్తి - September 25, 2026
- అనుమతులు లేని వైద్య కేంద్రాలపై అధికారుల కొరడా - September 25, 2026
- 22వ వార్డులో ఘనంగా అన్నదాన కార్యక్రమం – హాజరైన మున్సిపల్ చైర్ పర్సన్ శ్రీమతి శ్రీ కడకంచి బాలమణి శ్రీనివాస్ గారు - September 25, 2026

రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేసే వరకు యువత, విద్యార్థులు, రైతులు, మహిళలు, పేదలు, మధ్యతరగతి ప్రజల సమస్యలపై భారతీయ జనతా పార్టీ పోరాటం కొనసాగిస్తుందని బీజేపీ జనగామ జిల్లా అధ్యక్షుడు సౌడ రమేష్ తెలిపారు.గురువారం జనగామలోని బీజేపీ జిల్లా కార్యాలయంలో వివిధ మోర్చాలకు సంబంధించిన ముఖ్య నాయకులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. విద్యార్థులకు పెండింగ్‌లో ఉన్న ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను చెల్లించాలని, రైతుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. పాలిటెక్నిక్ విద్యార్థుల భవిష్యత్తును ప్రభావితం చేస్తున్న 97 జీవోను రద్దు చేసే వరకు విద్యార్థుల పక్షాన పోరాటం కొనసాగిస్తామని అన్నారు.ఎన్నికల ముందు ఇచ్చిన హామీల మేరకు నిరుపేద మహిళలకు నెలకు రూ.2,500, నిరుద్యోగ యువతకు రూ.4,500 నిరుద్యోగ భృతి అందించాలని డిమాండ్ చేశారు. గ్రామాల్లో రాజకీయ పార్టీలతో సంబంధం లేకుండా అర్హులైన నిరుపేద కుటుంబాలకు ఇందిరమ్మ ఇళ్లు కేటాయించాలని కోరారు.ప్రభుత్వ హామీలు అమలయ్యే వరకు కార్యకర్తలు ప్రజా సమస్యలపై నిరంతరం పోరాటాలు కొనసాగించాలని సౌడ రమేష్ పిలుపునిచ్చారు.కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర నాయకుడు ఉడుగుల రమేష్, జిల్లా ఉపాధ్యక్షుడు దేవర ఎల్లయ్య, యువ మోర్చా జిల్లా అధ్యక్షుడు ల్లబోయిన హరీష్, సేవా సంకల్ప అభియాన్ జిల్లా కన్వీనర్ డాక్టర్ శశిధర్ గుప్తా, పెద్దోజు జగదీష్, మెడికల్ సెల్ జిల్లా కన్వీనర్ డాక్టర్ వెంకటేశ్వర్లు, మహిళా మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శులు ముసుకే స్వప్న, రమ, దూసరి శివకృష్ణ, మోతె జనార్ధన్, రమేష్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.
