ఎమ్మెల్యేకి ప్రసాదం అందజేసిన పలంచ ఉదయ్ కిరణ్*

  సంగారెడ్డి :- నర్సాపూర్ నియోజకవర్గ శాసనసభ్యురాలు వి. సునీత లక్ష్మారెడ్డిని సంగారెడ్డి జిల్లా హత్నూర  మండలం మధుర గ్రామానికి చెందిన బీఆర్ఎస్ నాయకులు పలంచ ఉదయ్ కిరణ్ నేడు మర్యాదపూర్వకంగా కలిశారు. శబరిమలై యాత్ర పూర్తి చేసుకుని వచ్చిన సందర్భంగా, ఎమ్మెల్యేకి అయ్యప్ప స్వామి ప్రసాదాన్ని అందజేసి ఆశీస్సులు తీసుకున్నారు.

ఈ సందర్భంగా పలంచ ఉదయ్ కిరణ్ మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రజల సంక్షేమం, అభివృద్ధి కోసం మరోసారి తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా గులాబీ జెండా ఎగరాలని, బాపు కేసీఆర్ తిరిగి ముఖ్యమంత్రి కావాలని ఆ అయ్యప్ప స్వామిని మనస్ఫూర్తిగా కోరుకున్నట్లు తెలిపారు. అలాగే, నర్సాపూర్ నియోజకవర్గ గడ్డపై మళ్ళీ బీఆర్ఎస్ జెండా రెపరెపలాడాలని, నియోజకవర్గ అభివృద్ధి ప్రదాత సునీతమ్మ మరోసారి ఎమ్మెల్యేగా గెలవాలని ఆకాంక్షించినట్లు పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో మధుర గ్రామ సర్పంచ్ నవీన్ గౌడ్, హత్నూర మండల కార్మిక విభాగ అధ్యక్షులు శంకర్, మధుర గ్రామ వార్డు మెంబర్ మన్నెకుమార్ తదితరులు పాల్గొన్నారు.

Kondagalla Sridhar

I'm Sridhar kondagalla from Hathnoora vill., mdl., sangareddy dist I'm working as Reporter correspondent to Narsapur constituency at the paper of print & electronic media named Gnana telangana

You may also like...