కపిల్స్ కిచెన్ ప్రారంభోత్సవానికి హాజరైన మాజీ మంత్రి, మాజీఎమ్మెల్యే

కామారెడ్డి పట్టణంలోని దేవునిపల్లిలో తాడ్వాయి మాజీ సొసైటీ చైర్మన్ కపిల్ రెడ్డి నూతనంగా ఏర్పాటు చేసిన ‘కపిల్స్ కిచెన్’ ప్రారంభోత్సవ కార్యక్రమానికి మాజీ మంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి, ఎల్లారెడ్డి మాజీ ఎమ్మెల్యే జాజాల సురేందర్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు కిచెన్‌ను ప్రారంభించి యజమాని కపిల్ రెడ్డికి శుభాకాంక్షలు తెలిపారు.

నాణ్యమైన, రుచికరమైన ఆహారాన్ని అందిస్తూ, తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలు ఉట్టిపడేలా ఆకర్షణీయమైన వాతావరణంతో ‘కపిల్స్ కిచెన్’ ప్రజల మన్ననలు పొందాలని ఆకాంక్షించారు. వ్యాపార రంగంలో ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని యజమానికి శుభాకాంక్షలు తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో పలువురు సీనియర్ నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు.

You may also like...