ఎల్ఐసీ ఉద్యోగుల సంఘం నూతన కమిటీల ఏకగ్రీవ ఎన్నిక
- అయ్యప్పలకు అన్నప్రసాద వితరణ - November 25, 2026
- బీమా సౌకర్యం జీపీ సిబ్బంది ఆర్ధిక భద్రత : పామనుగుండ్ల సర్పంచ్ వడ్డె మాధవిసైదిరెడ్డి - November 24, 2026
- ఘనంగా కార్తీక పౌర్ణమి వేడుకలు.. శివాలయాల్లో భక్తుల సందడి.. దీపారాధనతో ఆధ్యాత్మిక శోభ - November 24, 2026
జ్ఞాన తెలంగాణ, కట్టంగూర్, నవంబర్ 24,
భారత జీవిత బీమా సంస్థ (ఎల్ఐసీ) సికింద్రాబాద్ డివిజన్ పరిధిలోని ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఎంప్లాయీస్ యూనియన్ (ఐసిఈయు) నల్గొండ బ్రాంచ్-1, బ్రాంచ్-2 లకు 2026-27 సంవత్సరానికి గాను నూతన కార్యవర్గ కమిటీలు ఏకగ్రీవంగా ఎన్నికయ్యాయి. నల్గొండ బ్రాంచ్-1 నూతన కమిటీ అధ్యక్షులుగా కొప్పు వెంకన్న, ఉపాధ్యక్షులుగా వింజమూరి శ్రీనివాస్, కార్యదర్శిగా ఐతగోని లక్ష్మీనారాయణ, సంయుక్త కార్యదర్శులుగా గుండగోని శ్రీనివాస్, యర్కల యాదగిరి, కోశాధికారిగా లకడాపురం రామకృష్ణ, డివిజనల్ కౌన్సిల్ సభ్యులుగా దేవగిరి అంజయ్య, కార్యవర్గ సభ్యులుగా పల్లపు లింగయ్య, శ్రీరామదాసు యాదగిరి, మద్దూరి రామకృష్ణ, బొల్లు సుధాకర్, పాలెం శ్రీకాంత్ లు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అదేవిధంగా నల్గొండ బ్రాంచ్-2 నూతన కమిటీ అధ్యక్షులుగా ఏర్పుల యాదగిరి, ఉపాధ్యక్షులుగా జిన్నా శ్రీనివాస్ రెడ్డి, కార్యదర్శిగా చిలుకూరి రమేష్, సంయుక్త కార్యదర్శిగా పెద్ది రమేష్ గౌడ్, కోశాధికారి కె. చంద్రమోహన్, డివిజనల్ కౌన్సిల్ సభ్యులుగా వేముల శ్రీనివాస్, కార్యవర్గ సభ్యులుగా మహమ్మద్ అఫ్సర్, జి.లక్ష్మణ్ తదితరులు ఏకగ్రీవంగా ఎన్నికైనారు. ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన కమిటీ సభ్యులు ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి, సంస్థ అభివృద్ధికి కృషి చేస్తామని పేర్కొన్నారు.
