ట్రాన్స్ఫార్మర్ వద్ద విద్యుదాఘాతం.. రైతు మృతి
- ములుగు జిల్లా తాడ్వాయి మండలం దామెరవాయి గ్రామానికి చెందిన కుర్సం సమ్మక్క హనుమకొండలోని ఎంజీఎం ఆసుపత్రిలో అనారోగ్యంతో ఐసీయూలో చికిత్స పొందుతున్నారు. విషయం తెలుసుకున్న బీఆర్ఎస్ ములుగు నియోజకవర్గ జిల్లా నా - November 24, 2026
- ట్రాన్స్ఫార్మర్ వద్ద విద్యుదాఘాతం.. రైతు మృతి - November 24, 2026
- విద్యార్థులు ఉన్నత శిఖరాలను అధిరోహించాలి: ప్రధానోపాధ్యాయుడు ఆనందరావు - November 13, 2026
ఏటూరు నాగారరం: వ్యవసాయ ట్రాన్స్ఫార్మర్ వద్ద విద్యుదాఘాతానికి గురై ఎస్కే బషీర్ (33) అనే రైతు మృతి చెందాడు. ఏటూరునాగారం విద్యుత్ శాఖ సెక్షన్ పరిధిలోని చిన్నబోయినపల్లి గ్రామంలో మంగళవారం ఉదయం 9 గంటల సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. వ్యవసాయ మోటారు పనిచేయకపోవడంతో ట్రాన్స్ఫార్మర్ వద్ద ఏబీ స్విచ్‌ను ఆపరేట్ చేస్తూ ఫ్యూజ్ సమస్యను సరిచేసే క్రమంలో విద్యుత్ షాక్‌కు గురై ప్రాణాలు కోల్పోయాడు. హెచ్‌జీ ఫ్యూజ్‌కు సంబంధించిన ఆర్-ఫేజ్ వైర్ తెగి ఎర్తింగ్ ద్వారా ఏబీ స్విచ్ హ్యాండిల్‌కు విద్యుత్ ప్రవహించినట్లు ప్రాథమిక పరిశీలనలో గుర్తించారు. విద్యుత్ శాఖ సిబ్బందికి సమాచారం ఇవ్వకుండా, లైన్ క్లియర్ తీసుకోకుండా మరమ్మతులు చేపట్టడం ప్రమాదానికి దారితీసినట్లు అధికారులు వెల్లడించారు.
